Hair Colouring: హెయిర్ కలరింగ్ చేయిస్తున్నారా..? ఈ విషయాలను మరచిపోతే ఇక అంతే..!

ఈ మధ్య కాలంలో హెయిర్ కలరింగ్ ట్రెండ్ విపరీతంగా పెరిగిపోయింది. వాతావరణంలోని మార్పుల కారణంగా జుట్టు తెల్లగా మారడం, గ్రే కలర్‌లోకి మారడం ఒక కారణం అయితే, నచ్చిన కలర్‌లో హెయిర్‌ని.

Hair Colouring: హెయిర్ కలరింగ్ చేయిస్తున్నారా..? ఈ విషయాలను మరచిపోతే ఇక అంతే..!
Hair Colouring
Follow us

|

Updated on: Mar 28, 2023 | 2:28 PM

ఈ మధ్య కాలంలో హెయిర్ కలరింగ్ ట్రెండ్ విపరీతంగా పెరిగిపోయింది. వాతావరణంలోని మార్పుల కారణంగా జుట్టు తెల్లగా మారడం, గ్రే కలర్‌లోకి మారడం ఒక కారణం అయితే, నచ్చిన కలర్‌లో హెయిర్‌ని మార్చుకోవడం మరో కారణం. అయితే ఈ పని చేసే ముందు హెయిర్‌స్టైలిస్ట్ సలహాలను తప్పకుండా తీసుకోవాలి. మీ జుట్టు రకం, ఆకృతిని బట్టి రంగు ఎంచుకోవాలి. లేకపోతే జుట్టు సమస్యలు ఎదురై మొత్తం పాడయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు జుట్టు కలరింగ్ చేసుకుంటున్నట్లయితే పాటించవలసిన అనేక విషయాలు ఉన్నాయి. ఒక్కసారి అవేంటో తెలుసుకుందాం.

స్టైలింగ్ టూల్స్: మీరు జుట్టును తరచుగా స్టైలింగ్ చేయడం మానుకోవాలి. ముఖ్యంగా స్టైలిష్ టూల్స్ అధికంగా ఉపయోగించడం జుట్టుకు హానికరం.

హెయిర్‌స్టైలిస్ట్ సహాయం: మీ జుట్టుకు కలర్ వేయాలునుకుంటే ఎప్పుడూ కూడా హెయిర్‌స్టైలిస్ట్ వద్ద వేయించుకోండి. వారు ఈ పనిలో నిపుణులు. జుట్టుకు హాని జరగకుండా ఎంత రసాయనాలు వాడాలో వారికి తెలుసు.

ఇవి కూడా చదవండి

షాంపుల వాడకం: మీరు హెయిర్ కలర్‌ని వాడుతుంటే.. షాంపూలను, కండిషనర్‌లను ఎక్కువగా వాడవద్దు. హెయిర్ కలర్‌లోని రసాయనాలు, షాంపూ లేదా కండిషనర్‌లోని రసాయనాలు కలిస్తే మీ జుట్టుకు హని కలుగుతుంది.

జుట్టును కడగడం: మీరు జుట్టుకు రంగు వేసినట్లయితే కనీసం 3 రోజులు దానిని కడగవద్దు. ఈ సమయంలో మీరు వేసుకున్న రంగు మీ జుట్టుకు బాగా సెట్ అవుతుంది. అలాగే రంగు వేసుకున్నవారు ఎల్లప్పుడూ చల్లటి నీటితోనే జుట్టును కడగాలి. వేడి లేదా గోరువెచ్చని నీటితో కడగకూడదు.

మరిన్ని లైఫ్‌స్టైల్  వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..