AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: నీ ధైర్యానికి దండంరా సామీ..! సీసీ కెమెరాపై స్లిప్స్ విసిరిన యువకుడు.. వైరల్ అవుతున్న ఫుటేజీ వీడియో..

బ్యాక్ బెంచర్స్ సంగతి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. వారికి కాపీ స్లిప్స్ తెచ్చుకునే అవసరం రానే రాదు, ఎందుకంటే టీచర్స్ అంతా వారికి ఫ్రెండ్సే కదా..! అయితే ఎగ్జామ్ కోసం కాపీ స్లీప్స్ తెచ్చుకున్నవాళ్లు..

Watch Video: నీ ధైర్యానికి దండంరా సామీ..! సీసీ కెమెరాపై స్లిప్స్ విసిరిన యువకుడు.. వైరల్ అవుతున్న ఫుటేజీ వీడియో..
Student Throwing Slips Towards Camera
శివలీల గోపి తుల్వా
|

Updated on: Mar 28, 2023 | 12:39 PM

Share

ఓపెన్‌గా చెప్పుకోలేకపోయినా టాపర్‌గా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకునేవారు కూడా ఏదో ఒక సందర్భంలో ఎగ్జామ్ కాపీ చేసే ఉంటారు. ఇక బ్యాక్ బెంచర్స్ సంగతి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. వారికి కాపీ స్లిప్స్ తెచ్చుకునే అవసరం రానే రాదు, ఎందుకంటే టీచర్స్ అంతా వారికి ఫ్రెండ్సే కదా..! అయితే ఎగ్జామ్ కోసం కాపీ స్లీప్స్ తెచ్చుకున్నవాళ్లు, పరీక్ష తర్వాత ఎవరికీ తెలియకుండా వాటిని బయట పడేస్తారు.  కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో అలా జరగలేదు. స్లిప్స్ తెచ్చి పరీక్ష రాసిన యువకుడు, ఎగ్జామ్ తర్వాత వాటిని సీసీ కెమెరాకు చూపించి మరీ దానిపై విసిరాడు. ఇక దీనికి సంబంధించిన వీడియో నెట్టింట పోస్ట్ కావడంతో అది కాస్త వైరల్ అవుతోంది.

wehatejntu అనే ఇన్‌స్టా ఖాతా నుంచి పోస్ట్ అయిన వీడియోలో మీరు ఈ దృశ్యాలను చూడవచ్చు. మొదటిగా పరీక్ష అయిపోయి అందరూ బయటకు వెళ్తుండగా ఓ కుర్రాడు ఎగ్జామ్ హాల్‌లోనే ఉన్న సీసీ కెమెరా ముందు నిలబడతాడు. దానివైపు తన చేతిలోని స్లిప్స్ చూపిస్తూ, ఎన్ని ఉన్నాయో లెక్కిస్తూ ఉంటాడు. ఆ క్రమంలో కెమెరాను చూసి ఆ యువకుడు ఏదో మాట్లాడతాడు కూడా. ఇక చివరికి ‘తీసుకో’ అన్నట్లుగా ఆ కెమెరా మీదకు స్లిప్స్ అన్నీ విసురుతాడు. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు తెగ నవ్వేసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by JNTU Haters (@wehatejntu)

కాగా, ఈ వీడియోకు ఇప్పటివరకు 11 వేల లైకులు, 6 లక్షల 13 వేల వీక్షణలు వచ్చాయి. ఇదే క్రమంలో పలువురు నెటిజన్లు వీడియోపై తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఓ నెటిజన్ అయితే ‘ వచ్చిన ప్రశ్నలకు, తెచ్చిన స్లిప్స్‌కి సంబంధం లేదనుకుంటా..’ అని సరదాగా రాసుకొచ్చాడు. మరో నెటిజన్ ‘వీడి ఫ్యూచర్ నాకు అర్థమయిపోయింది’ అని, ఇంకొకరు ‘వీడు చాలా ధైర్యవంతుడు’ అంటూ రాసుకొచ్చారు.  అలాగే కొందరు ఎమోజీల ద్వారా తమ స్పందనలను వ్యక్తపరుస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..