- Telugu News Photo Gallery Business photos Top 6 most expensive bikes that are available in Indian Market checkout for the list
Expensive Bikes: టాప్ 6 ఖరీదైన బైక్స్ ఇవే.. కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే.. ధోని బైక్ ధర ఎంతంటే..
ఇండియన్ మార్కెట్‌లోకి ఎన్నో రకాల బైకులు వస్తున్నాయి. ఇక వాటిలో అత్యంత ఖరీదైన బైక్ మన సొంతమైతే ఆ కిక్ ఎలా ఉంటుంది..? ఊహకే అద్దిరిపోయింది కదా.. మరి అలాంటి ఖరీదైన(రూ. 80 లక్షల నుంచి రూ. 40 లక్షల వరకు) బైకులు మన దేశంలో ఏయే మోడల్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
Updated on: Mar 28, 2023 | 9:52 AM

Kawasaki Ninja H2R(ఎక్స్-షోరూం ధర రూ.79.9 లక్షలు): మోటోజీపీ, ఫార్ములా1, ఫార్ములా 2 రేసులలో ఉపయోగించే టెక్నాలజీని ఈ బైక్‌లో ఉపయోగించారు. ఈ కారు రేసింగ్‌లో రికార్డులు బద్దలు కూడా కొట్టగలదు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా ఈ బైక్‌ను కొనుగోలు చేశాడు. ధోనికి బైక్‌లు అంటే ఎంత పిచ్చో మనకు తెలిసిందే.

Ducati Streetfighter V4 Lamborghini(ఇంకా లాంచ్ కాలేదు. అంచనా ధర రూ.72 లక్షలు): డుకాటి, లాంబోర్గిని రెండు కంపెనీలు కలిసి రూపొందించిన ఈ బైక్ డిజైన్ చూడటానిక హురాకాన్ ఎస్టీవో నుంచి ఇన్‌స్పైర్ అయినట్లు ఉంటుంది. 2023లోనే ఇండియన్ మార్కెట్‌లోకి రానున్న ఈ ఎక్స్‌క్లూజివ్ స్ట్రీట్ ఫైటర్ ధర రూ.72 లక్షలు ఉండవచ్చనేది అంచనా. కానీ లాంచ్ సమయానికి రూ.80 లక్షల వరకు వెళ్లే అవకాశం ఉంది.

Ducati Panigale V4 R(ఇంకా లాంచ్ కాలేదు. అంచనా ధర రూ.72 లక్షలు): 998 సీసీ ఇంజిన్‌తో వస్తున్న డుకాటి పనిగలే వీ4.. ఏకంగా 16,800 ఆర్‌పీఎం వరకు అందించనుంది.

Big Dog K9 Red Chopper 59(ఎక్స్-షోరూం ధర రూ.59 లక్షలు): బిగ్ డాగ్ కే9 రెడ్ ఛాపర్ సీసీ పవర్ ఏకంగా 1807, ఇంకా ఇది 45-డిగ్రీ V-ట్విన్‌ను కలిగి ఉంది. దీని పనితీరు గురించి ఎలాంటి సమాచారం లేకపోయినప్పటికీ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

BMW M 1000 RR(ఎక్స్-షోరూం ధర రూ.45 లక్షలు): ముందు భాగాన్ని ఆప్టిమైజ్ చేయబడిన ఈ బైక్‌లో కార్బన్ ఫైబర్ వింగ్లెట్స్‌ను ఫిట్ చేశారు. ఇది డౌన్‌ఫోర్స్‌ను పెంచుతుంది. సైడ్ ట్రిమ్ ప్యానెల్స్‌ను కార్బన్‌తో చేశారు. ఇది వాహనం వేగాన్ని మరింత పెంచుతుంది.ఇంకా ఎం ఏరో వీల్ కవర్స్‌ను కూడా అందించారు. రేసింగ్ బైక్స్‌లోనే ఇలాంటివి ఉంటాయి.

Honda Goldwing Tour(ఎక్స్-షోరూం ధర రూ.39.16 లక్షలు): హోండా గోల్డ్ వింగ్ టూర్ చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంటుంది. 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్‌ను ఇందులో అందించారు. ఎయిర్‌బ్యాగ్‌తో వచ్చే మోటార్ సైకిల్ ఇదే. లిక్విడ్ కూల్డ్, ఫ్లాట్ 6 ఇంజిన్ ఇందులో ఉంది. 170 ఎన్ఎం టార్క్, 125 బీహెచ్‌పీ, 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ అందించారు.





























