- Telugu News Photo Gallery World photos South pacific country Tuvalu could be disappear from world due to its climate change check here for details
Tuvalu: ప్రపంచ పటం నుంచి కనుమరుగైపోతున్న చిన్ని దేశం.. కారణం ఏమిటంటే..? తెలుసుకుందాం రండి..
వాతావరణంలోని మార్పులు, ముఖ్యంగా గ్లోబల్ వార్మింగ్ వంటి విపత్కర పరిస్థితులు ప్రకృతికి హానికరంగా ఉంటాయి. దీని కారణంగానే ఇప్పుడు ప్రపంచ పటం నుంచి ఓ అందమైన దేశం కనిపించకుండా పోబోతోంది.
Updated on: Mar 30, 2023 | 6:37 AM

తువాలు దక్షిణ మహాసముద్రంలో ఉన్న ఓ అందమైన దేశం. కానీ ఈ దేశం త్వరలో మునిగిపోతోంది. అవును పలు నివేదికల ప్రకారం ఈ దేశం త్వరలో ప్రపంచ పటం నుంచిఅదృశ్యమవుతుంది. అలా కావడానికి అసలు కారణం ఇప్పుడు తెలుసుకుందాం..

ఆస్ట్రేలియా-హవాయి దేశాల మధ్య దక్షిన మహాసముద్రంలోని తొమ్మిది దీవుల సమూహం తువాలు ఐలాండ్. ఇక్కడ 12 వేల మంది నివసిస్తున్నారు. ఇప్పటికే తువాలు రాజధాని ప్రాంతం 40 శాతం సముద్రంలో కలిసిపోయింది.

నివేదికల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మార్పులు అంటే గ్లోబల్ వార్మింగ్ కారణంగా సముద్రపు నీటి మట్టం క్షీణిస్తోంది. దీని వల్ల తువాలు మునిగిపోయే ప్రమాదం పెరుగుతోంది.

అయితే ఈ దేశం మునిగిపోవడానికి బదులు మరింత పెరిగిందని అనేక నివేదికలు కూడా తెరపైకి వచ్చాయి. తువాలు కోసం దాని పరిమాణం సహజంగా పెరిగిందని ఆక్లాండ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు తమ తాజా పరిశోధనలో ఈ వాదనను చేసారు.

ఇంకా ఈ దేశం ప్రపంచంలోనే నాల్గో అతి చిన్న దేశం. వాటికన్ సిటీ, మొనాకో, నౌరు తర్వాత తువాలు అతి చిన్న దేశంగా ఉంది. విశేషమేమిటంటే ఈ దేశప్రజలు రన్‌వేపై విమానాలు రానప్పుడు తమకు నచ్చిన క్రీడలు ఆడేందుకు తువాలులో అనుమతి కూడా ఉంది.

ఈ నేపథ్యంలో భవిష్యత్తు తరాలకు తువాలు దేశ సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేసేందుకు మెటావర్స్‌లో ఈ దేశాన్ని రూపొందించనున్నట్లు ఆ దేశ మంత్రి సైమన్ కోఫే తెలిపారు. మెటావర్స్ ద్వారా అక్కడి ప్రకృతి అందాలను, ప్రజల జీవనశైలిని పర్యాటకులు చూడొచ్చన్నారు.

త్వరలోనే తువాలు తొలి వర్చువల్ దేశంగా ప్రపంచ ప్రజలకు దర్శనమివ్వబోతుందని సైమన్ తెలిపారు. తువాలును మెటావర్స్ దేశంగా మార్చేందుకు ది మంకీస్, కొల్లైడర్ అనే రెండు సంస్థలు పనిచేస్తున్నాయి.





























