TSPSC paper leak case: మొత్తం ఆరు పరీక్షలకు సంబంధించి 15 పేపర్లు లీక్‌.. సిట్‌ దర్యాప్తులో కీలక పురోగతి

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీక్‌ వ్యవహారంలో సిట్‌ అధికారులు కీలక విషయాలు వెల్లడించారు. గతేడాది అక్టోబర్‌ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి ఆఖరి వారం వరకు సాగిన తెలంగాణ పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్‌ నియామక పరీక్షల్లో మొత్తం ఆరు రకాల పరీక్షలకు సంబంధించిన 15 ప్రశ్నపత్రాలు..

TSPSC paper leak case: మొత్తం ఆరు పరీక్షలకు సంబంధించి 15 పేపర్లు లీక్‌.. సిట్‌ దర్యాప్తులో కీలక పురోగతి
TSPSC paper leak case
Follow us

|

Updated on: Mar 31, 2023 | 8:02 AM

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీక్‌ వ్యవహారంలో సిట్‌ అధికారులు కీలక విషయాలు వెల్లడించారు. గతేడాది అక్టోబర్‌ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి ఆఖరి వారం వరకు సాగిన తెలంగాణ పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్‌ నియామక పరీక్షల్లో మొత్తం ఆరు రకాల పరీక్షలకు సంబంధించిన 15 ప్రశ్నపత్రాలు లీకైనట్లు తేల్చారు. వీటిల్లో గ్రూప్‌ 1 పేపర్లు ఐదుగురి మధ్య లీకైంది. గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పేపర్‌ను ప్రవీణ్‌ తొలుత సురేష్, రమేష్‌లకు ఇచ్చాడు. రాజశేఖర్‌రెడ్డి నుంచి షమీమ్‌కు, న్యూజిలాండ్‌లో ఉండే తన సమీప బంధువు ప్రశాంత్‌ రెడ్డికి ఇచ్చాడు. ఈ ఐదుగురికి మినహా మరెవరికీ ఈ ప్రశ్నపత్రం చేరినట్లు ఇప్పటివరకు ఆధారాలు లభించలేదని సిట్‌ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలకు సంబంధించిన పేపర్లను కూడా తస్కరించేందుకు నిందితులు పథకం వేసినట్లు దర్యాప్తులో తెలిసింది. ఏఈ, గ్రూప్‌ 1 ప్రిలిమ్స్ మినహా మిగతావి పెన్‌డ్రైవ్‌కే పరిమితమైనట్లు సిట్‌ దర్యాప్తులో తేలింది.

ప్రవీణ్‌ పెన్‌డ్రైవ్‌లో మొత్తం ఆరు పోస్టులకు సంబంధించిన పరీక్షల పత్రాలు ఉన్నట్లు గుర్తించారు. గ్రూప్‌–1 ప్రిలిమ్స్, అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఏఈ), అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (ఏఈఈ) టౌన్‌ ప్లానింగ్‌ బిజినెస్‌ ఓవర్సీర్‌ (టీపీబీఓ), జూనియర్‌ లెక్చరర్‌ (జేఎల్‌), డిస్ట్రిక్ట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ (డీఏఓ) పేపర్లు పెన్‌డ్రైవ్‌లో ఉన్నాయని, ఇవన్నీ మాస్టర్‌ క్వశ్చన్‌ పేపర్లని, వీటిల్లో ప్రశ్నలతో పాటు సమాధానాలు కూడా ఉన్నాయని సిట్‌ అధికారులు చెప్తున్నారు. పోలీసు కస్టడీలో ఉన్న ముగ్గురు నిందితులు షమీమ్, సురేష్, రమేష్‌లను సిట్‌ పోలీసులు రెండోరోజు (గురువారం) 8 గంటల పాటు ప్రశ్నించారు. వారి ఇళ్లల్లో సోదాలు జరిపి గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ పరీక్షకు సంబంధించి మాస్టర్‌ ప్రశ్నపత్రాల కాపీలు స్వాధీనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రవీణ్‌ పెన్‌డ్రైవ్‌లోని 15 ప్రశ్నపత్రాలు ఇవే…

  • గ్రూప్‌–1 జనరల్‌ స్టడీస్‌
  • ఏఈఈ సివిల్‌ ఇంజనీరింగ్‌
  • ఏఈఈ ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌
  • ఏఈఈ మెకానికల్‌ ఇంజనీరింగ్‌
  • డీఏఓ జనరల్‌ స్టడీస్‌
  • డీఏఓ మేథమెటిక్స్‌
  • జనరల్‌ స్టడీస్‌ డిప్లొమా ఏఈ
  • సివిల్‌ ఇంజనీరింగ్‌ డిప్లొమా ఏఈ
  • మెకానికల్‌ ఇంజనీరింగ్‌ డిప్లొమా ఏఈ
  • ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ డిప్లొమా ఏఈ
  • మెకానికల్‌ ఇంజనీరింగ్‌ డిప్లొమా ఏఈ పేపర్‌–2
  • సివిల్‌ ఇంజనీరింగ్‌ డిప్లొమా ఏఈ పేపర్‌–2
  • టీపీబీఓ ఒకేషనల్‌ జనరల్‌ స్టడీస్‌ పేపర్‌–1
  • టీపీబీఓ ఇంటర్మీడియట్‌ ఒకేషనల్‌ పేపర్‌–2
  • జూనియర్‌ లెక్చరర్స్‌ ఎగ్జామ్‌

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.