AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: బండి వర్సెస్‌ కేటీఆర్‌.. ట్విట్టర్‌ వేదికగా నేతల మధ్య బిగ్‌ ఫైట్‌. దిక్కుమాలిన పార్టీ అవసరమా అంటూ ఫైర్‌.

బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్, మంత్రి కేటీఆర్ మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ ఫ్యామిలీని ఉద్దేశించి బండి సంజయ్ చేసిన ఆరోపణలకు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం హామీలను మోదీ సర్కార్‌ దారుణంగా..

Telangana: బండి వర్సెస్‌ కేటీఆర్‌.. ట్విట్టర్‌ వేదికగా నేతల మధ్య బిగ్‌ ఫైట్‌. దిక్కుమాలిన పార్టీ అవసరమా అంటూ ఫైర్‌.
Ktr Vs Bandi Sanjay
Narender Vaitla
|

Updated on: Mar 31, 2023 | 7:51 AM

Share

బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్, మంత్రి కేటీఆర్ మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ ఫ్యామిలీని ఉద్దేశించి బండి సంజయ్ చేసిన ఆరోపణలకు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం హామీలను మోదీ సర్కార్‌ దారుణంగా ఉల్లంఘించిందని కేటీఆర్ ట్వీట్టర్లో విమర్శించారు. దీనికి వెన్నెముక లేని తెలంగాణ బీజేపీ ఎంపీలు బాధ్యత వహించాలన్నారు. తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరీ నిరాకరించిన ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌కు 20 వేల కోట్ల లోకోమోటివ్ కోచ్ ఫ్యాక్టరీ కేటాయించారని విమర్శించారు. తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరీ, పసుపు బోర్డు, మెట్రో రెండో దశ, ఐటిఐఆర్ ప్రాజెక్టు, గిరిజన యూనివర్సిటీ,బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ, ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చేది లేదని మోదీ చెప్పారని గుర్తు చేశారు. మోదీ ప్రాధాన్యతలో తెలంగాణ లేనప్పుడు..ఈ రాష్ట్రంలో ఆ దిక్కుమాలిన పార్టీ ఎందుకుండాలని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్‌.

బండి సంజయ్‌ కౌంటర్‌..

మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌కి కౌంటర్‌ ఇచ్చారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌. ఉద్యమకారులకు పార్టీలో చోటివ్వం..నిరుద్యోగ భృతి ఇవ్వం, దళితులకు మూడెకరాలు, ముఖ్యమంత్రి పదవి ఇవ్వం, డబుల్‌ బెడ్రూం, ఖాళీలున్నా ఉద్యోగాలు భర్తీ చెయ్యమని, పంచాయతీ, ఆలయాలు, మున్సిపాల్టీలకు నిధులివ్వని కేసీఆర్‌ను ఎందుకు భరించాలి..? అసలు కేసీఆర్ తన పార్టీ నుంచే తెలంగాణను తొలగిస్తే, ఆయనను ఎందుకు ఈ రాష్ట్రం నుంచి తొలగించకూడదో చెప్పాలని ట్విట్టర్‌ వేదికగా బండిసంజయ్‌ ప్రశ్నించారు.

ఇదిలా ఉంటే.. ఉప్పల్‌-నారపల్లి ఫ్లై ఓవర్‌ నిర్మాణం పొలిటికల్‌ టర్న్‌ తీసుకుంది. 2018 మేలో ఫ్లైఓవర్‌ పనులు ప్రారంభమైనా , ఇప్పటికీ 40శాతం పనులు పూర్తికాలేదని పిల్లర్లపై పోస్టర్లు వెలిశాయి. ఈ విషయంపై మంత్రి కేటీఆర్‌ మార్చి 27న ట్విట్టర్‌లో స్పందించారు. ఐదేళ్లలో తాము 35 ఫ్లైఓవర్ ప్రాజెక్టులు పూర్తి చేశామని, కేంద్ర ప్రభుత్వం నగరంలోని రెండు ఫ్లైఓవర్లు కూడా నిర్మించలేకపోయిందని విమర్శించారు.

ఇవి కూడా చదవండి

కార్పొరేటర్‌ రివర్స్‌ అటాక్‌..

మంత్రి కేటీఆర్‌ ట్వీట్లకు కౌంటర్‌గా.. పిల్లర్లపై పోస్టర్లు వేసి చురకలంటించారు బోడుప్పల్ 19వ డివిజన్‌ కార్పొరేటర్ పవన్‌. మార్చి 27న పేపర్‌లో వచ్చిన కథనాన్ని పోస్టర్‌గా అంటించి..వాస్తవాలు తెలుసుకోలని సూచించారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ఆలస్యానికి కారణం.. విద్యుత్, వాటర్ లైన్లను ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్, వాటర్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ సరైన సమయంలో షిప్ట్ చేయకపోవడమేనన్నారు. తప్పంతా మీ దగ్గర పెట్టుకుని ఇతరుల మీద నెపం వేయడం సరికాదన్నారు బీజేపీ కార్పొరేటర్‌. మొత్తానికి బీఆర్‌ఎస్‌-బీజేపీ మధ్య ట్వీట్‌ వార్లతోపాటు పోస్టర్ల పాలిటిక్స్‌ తెలంగాణలో రంజుగా మారాయి. మరి ఈ వివాదానికి ఎక్కడ ఫుల్‌స్టాప్‌ పడుతుందో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..