AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ హీరో అంటే పిచ్చి.. ఒక్కసారైనా అతనితో కలిసి నటించాలి.. మనసులో మాట బయట పెట్టిన మృణాల్

టాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు.. మొదటి సినిమాతోనే నటిగా సక్సెస్ అయ్యింది. ప్రస్తుతం హిందీలో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అలాగే తెలుగులో డెకాయిట్ అనే చిత్రంలో నటిస్తుంది.

ఆ హీరో అంటే పిచ్చి.. ఒక్కసారైనా అతనితో కలిసి నటించాలి.. మనసులో మాట బయట పెట్టిన మృణాల్
Mrunal Thakur
Rajeev Rayala
|

Updated on: Feb 23, 2026 | 9:06 AM

Share

బాలీవుడ్ నుంచి టాలీవుడ్ లోకి అడుగుపెట్టి సక్సెస్ అయిన వారు చాలా మంది ఉన్నారు వారిలో మృణాల్ ఠాకూర్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ తొలి సినిమాతోనే టాలీవుడ్ లో ఫ్యాన్స్ ను సొంతం చేసుకుంది. హనురాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామం సినిమాతో ఎంట్రీ ఇచ్చి భారీ విజయాన్ని అందుకుంది. తొలి సినిమాతోనే కుర్రాళ్లు ఈ అమ్మడికి ఫిదా అయ్యారు. ఆతర్వాత నాని హీరోగా వచ్చిన హాయ్ నాన్న సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలోనూ తన నటనతో ఆకట్టుకుంది. ఈ రెండు సినిమాలు విజయం సాధించిన తర్వాత విజయ్ దేవరకొండతో కలిసి ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేసింది. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. దాంతో మృణాల్ స్పీడ్ కు బ్రేకులు పడ్డాయి. విజయ్ దేవరకొండ సినిమా తర్వాత తెలుగులో పెద్దగా సినిమాల్లో నటించలేదు మృణాల్. కానీ హిందీలో సినిమాలు చేస్తుంది.

ప్రభాస్ కల్కి సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించింది. ఇక ఇప్పుడు అడవి శేష్ తో కలిసి డెకాయిట్ అనే సినిమాలో నటిస్తుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానింది. ఈ సినిమాతో పాటు మరో తెలుగు సినిమాలోనూ మృణాల్ హీరోయిన్ గా నటిస్తుందని టాక్.. అలాగే తమిళ్ లోనూ ఈ చిన్నది ఆఫర్స్ అందుకుంటుంది. కాగా మృణాల్ రీసెంట్ గా టాలీవుడ్ స్టార్ హీరో, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. 6టాలీవుడ్ లో అల్లు అర్జున్ అంటే తనకు చాలా ఇష్టమని తెలిపింది.

అల్లు అర్జున్ అంటే తనకు చాలా అభిమానం అని.. ఆయన  డాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉంటాయని చెప్పుకొచ్చింది. అలాగే ఆయనతో కలిసి ఒక్క సినిమా అయినా చేయాలన్నది తన కోరిక అంటూ మనసులోని మాట బయట పెట్టింది మృణాల్. అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో అవకాశం దొరికితే ఎంతో సంతోషిస్తానని చెప్పుకోచిందని మృణాల్. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

అల్లు అర్జున్ ఇన్ స్టా..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us