AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అతనొక అద్భుతం.. ఎలాంటి ఈగో లేని వ్యక్తి.. ఆ స్టార్ హీరో పై కమెడియన్ సుదర్శన్ ప్రశంసలు

హాస్యనటుడు గుండు సుదర్శన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో విభిన్న పాత్రలు చేసి మెప్పించారు. ముఖ్యంగా తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు గుండు సుదర్శన్. తాజాగా ఆయన హీరోల గురించి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

అతనొక అద్భుతం.. ఎలాంటి ఈగో లేని వ్యక్తి.. ఆ స్టార్ హీరో పై కమెడియన్ సుదర్శన్ ప్రశంసలు
Gundu Sudarshan
Rajeev Rayala
|

Updated on: Feb 23, 2026 | 8:47 AM

Share

గుండు సుదర్శన్.. ఈ నటుడు చాలా మంది తెలిసే ఉంటుంది. తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ మెప్పిస్తూ ఉంటారు సుదర్శన్. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు ఈయన. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారితో తనకున్న అనుబంధం గురించి ఎమోషనల్ అయ్యారు. సిరివెన్నెల గారు కేవలం సరస్వతీ పుత్రుడు కాదని, సరస్వతీ స్వరూపుడే అని ఆయన అభివర్ణించారు. తమ కుటుంబంలోని ఏ కార్యక్రమానికైనా హాజరయ్యేవారని, తమది అత్యంత సన్నిహిత సంబంధమని గుర్తు చేసుకున్నారు. సిరివెన్నెల గారి బాల్యం, చిన్న పిల్లవాడి మనస్తత్వం, ఆయన ఇంట్లో కూర్చుని పాటలు రాసిన సందర్భాలు, మనవరాలిపై రాసిన పాట వంటి వ్యక్తిగత జ్ఞాపకాలను పంచుకున్నారు.

అలాగే కామెడీ గురించి మాట్లాడుతూ “నవ్వు నాలుగు విధాల మేలు” అన్న సామెతకు తాను సంపూర్ణ న్యాయం చేస్తానని నవ్వుతూ చెప్పారు.  తన క్యాప్స్ కలెక్షన్ గురించి ప్రశ్నించగా, కోటిలో ఒక షాప్ పెట్టుకోవచ్చు” అని చమత్కరించారు. టోపీ ఎందుకు పెట్టుకుంటారనే ప్రశ్నకు, నాకు నేనే పెట్టుకుంటా, నాకు ఎవడు పెట్టకుండా నేనే పెట్టుకుంటే నాకు ఎవడు పెట్టడు కదా అని సరదాగా సమాధానమిచ్చారు. అలాగే తనకు ఇష్టమైన హీరోల గురించి మాట్లాడుతూ, జూనియర్ ఎన్టీఆర్  తనకి ఇష్టమైన హీరో అని సుదర్శన్ వెల్లడించారు. ఎన్టీఆర్ ఎనర్జీ, డెడికేషన్ అద్భుతమని, ఆయన వెనుక ఒక సూపర్ నేచురల్ పవర్ ఉంటుందని అనిపిస్తుందని అన్నారు.

సీనియర్ ఎన్టీఆర్ గారితో తన మొదటి సినిమా “శ్రీనాధ కవిసార్వభౌముడు” సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ ఆయన వద్దకు వచ్చేవాడని, చిన్ననాటి నుంచే ఆయనలో నాయకత్వ లక్షణాలు, నడకలో ఆత్మవిశ్వాసం కనిపించేవని గుర్తు చేసుకున్నారు. అమ్మగారి పర్యవేక్షణలో నాట్యం నేర్చుకోవడం, భక్త మార్కండేయ సీరియల్ లో నటించడం వంటివి పువ్వు పుట్టగానే పరిమళిస్తుందనడానికి నిదర్శనమని అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ, ఆయనలో ఒక అంతర్ముఖత్వం, ఆధ్యాత్మిక దృక్పథం ఎక్కువ అని సుదర్శన్ అన్నారు. పవన్ కళ్యాణ్ గారు విస్తృతంగా పుస్తకాలు చదువుతారని, కేవలం కాలక్షేపం కోసం కాకుండా ఒక ఫిలాసఫీని అర్థం చేసుకోవడానికి, గొప్ప వ్యక్తుల జీవిత ప్రయాణాలను తెలుసుకోవడానికి చదువుతారని అన్నారు. రామ్ చరణ్ ని వండర్ఫుల్ పర్సన్గా అభివర్ణించారు. ఆస్కార్ స్థాయి గుర్తింపు, ఉన్నతమైన కుటుంబ నేపథ్యంనుంచి వచ్చినప్పటికీ, ఆయనలో కనిపించే అద్భుతమైన వినయం, నిరాడంబరత గొప్పదని కొనియాడారు. సాటి కళాకారులను గౌరవించే విధానం, ఈగో లేని వ్యక్తిత్వం చాలా ప్రత్యేకమని, అది చాలా అరుదైన గుణమని తెలిపారు. రామ్ చరణ్ లో ఆ గుణాలు ఉన్నాయని ప్రశంసించారు. “తండ్రికి తగ్గ తనయుడు” అని ప్రశంసించారు సుదర్శన్.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us