అలాంటి సీన్స్ చేయలేక ఎన్నో సినిమాలు రిజెక్ట్ చేశా.. కాజల్..
Rajitha Chanti
Pic credit - Instagram
24 July 2026
చందమామ కాజల్ అగర్వాల్ దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. స్టార్ హీరోస్ అందరి సరసన నటించి మెప్పించింది.
వివాహం, మాతృత్వం తర్వాత కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ స్టార్ హీరోయిన్, ఇటీవల 'ది ఇండియా స్టోరీ' చిత్ర ప్రమోషన్లలో పాల్గొంటుంది కాజల్.
కెరీర్ ప్రారంభం నుంచే కొన్ని స్పష్టమైన హద్దులు విధించుకున్నానని కాజల్ తెలిపారు. అవకాశాలు వదులుకోవాల్సి వస్తుందనే భయంతో ఎప్పుడూ ఆ గీత దాటలేదని స్పష్టం చేశారు.
నాభి ప్రదర్శనలు, బికినీలు , ఇంటిమేట్ సీన్లకు దూరంగా ఉన్నానని, కేవలం ఆ కారణాల వల్లే కొన్ని భారీ ప్రాజెక్టులను తిరస్కరించినట్లు వెల్లడించారు.
తన నిర్ణయం ఎవరినీ విమర్శించడానికి కాదని, తన కంఫర్ట్ జోన్‌కు అనుగుణంగా తీసుకున్న వ్యక్తిగత నిర్ణయమని స్పష్టం చేశారు. ఇప్పుడు ఆమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
తల్లి అయిన తర్వాత తన ఆలోచనా విధానంలో మరింత బాధ్యత పెరిగిందని, భవిష్యత్తులో తన కుమారుడు తన సినిమాలు చూసి గర్వపడేలా ఉండాలనేదే తన కోరిక అని పేర్కొన్నారు.
దక్షిణాది వర్క్ కల్చర్‌ను ప్రశంసించిన కాజల్, ఇక్కడ లభించిన క్రమశిక్షణ, నటనకు ప్రాధాన్యమున్న పాత్రలే తన సుదీర్ఘ ప్రయాణానికి పునాది అని వెల్లడించారు.
ప్రస్తుతం కాజల్ చేతన్ డీకే దర్శకత్వంలో 'ది ఇండియా స్టోరీ' చిత్రంలో నటిస్తుండగా, నితీష్ తివారీ ప్రతిష్టాత్మక 'రామాయణ' ప్రాజెక్ట్‌లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు.