AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishna : నాన్నకు సర్జరీ పూర్తైంది.. ఇప్పుడేలా ఉన్నారంటే.. బాలయ్య ఆరోగ్యంపై నారా బ్రహ్మాణి పోస్ట్..

నందమూరి బాలకృష్ణ ఇటీవల షూటింగ్ లో గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనకు ప్రాథమిక చికిత్స అందించి అనంతరం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బాలకృష్ణ మోకాలికి శస్త్రచికిత్స చేయాల్సి వస్తుందని..తర్వాత దాదాపు నెల రోజులు చికిత్స తీసుకోవాల్సి వస్తుందని సూచించారు వైద్యులు.

Balakrishna : నాన్నకు సర్జరీ పూర్తైంది.. ఇప్పుడేలా ఉన్నారంటే.. బాలయ్య ఆరోగ్యంపై నారా బ్రహ్మాణి పోస్ట్..
Nara Brahmani , Balakrishna
Rajitha Chanti
|

Updated on: Jul 25, 2026 | 9:26 AM

Share

ఇటీవల నందమూరి బాలకృష్ణ ఓ సినిమా షూటింగ్ లో యాక్షన్ సన్నివేశం చేస్తుండగా గాయపడిన సంగతి తెలిసిందే. వెంటనే అప్రమత్తమైన చిత్రయూనిట్ ఆయకు ప్రాథమిక చికిత్స అందించి అనంతరం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బాలకకృష్ణ మోకాలికి శస్త్రచికిత్స చేయాల్సి వస్తుందని సూచించారు వైద్యులు. అనంతరం ఆయన నెల రోజులు విశ్రాంతి తీసుకోవాలని తెలిపారు. దీంతో ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు బాలయ్య త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థిస్తున్నారు. నందమూరి అభిమానులు బాలయ్య ఆరోగ్య పరిస్థితి పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి : రోజుకు 15000 అడుగులు నడుస్తా.. టిఫిన్లు అస్సలు చేయను.. 86 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‏గా.. మురళీ మోహన్ డైట్ సీక్రెట్ ఇదే..

ఈ క్రమంలోనే బాలయ్య పెద్ద కూతురు నారా బ్రహ్మాణి తన తండ్రి ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చింది. ఈ మేరకు తన ఇన్ స్టా ఖాతాలో బాలయ్య ఆరోగ్యం గురించి రాసుకొచ్చింది. “నాన్న సర్జరీ పూర్తిగా విజయవంతమైంది. ఆయన ప్రస్తుతానికి తన పాత ఉత్సాహాన్ని తిరిగి పొందారు. త్వరలోనే మళ్లీ పనుల్లోకి వస్తారు. ఆయనపై మీరు చూపిన అపారమైన ప్రేమకు, ప్రార్థనలకు చాలా ధన్యవాదాలు. మీ అందరికీ ఎంతో రుణపడి ఉన్నాము” అని పోస్ట్ చేశారు. దీంతో బాలయ్య సర్జరీ విజయవంతంగా పూర్తైందని తెలిసి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi: అతడిని డైరెక్టర్ చేయాలని సినిమా స్టార్ట్ చేశా.. ఎంతో ఫోర్స్ చేశా.. కానీ ఇప్పుడు పెద్ద నటుడు అయ్యాడు.. కృష్ణ వంశీ..

ప్రస్తుతం బాలయ్య ఆసుపత్రిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. మరో మూడు నాలుగు రోజుల్లోనే డిశ్చార్జ్ అవుతారని సమాచారం. అనంతరం నెల రోజులు రెస్ట్ తీసుకుంటారని.. ఆ తర్వాత తన కొత్త సినిమా షూటింగ్ లో భాగం కానున్నారని సమాచారం.

ఎక్కువ మంది చదివినవి : Bigg Boss 10 Telugu : బి‏గ్ బాస్‏లో జబర్దస్త్ క్రేజీ బ్యూటీ.. ఆఫర్ రావడంపై స్పందించిన గ్లామరస్ క్వీన్.. ఏమన్నారంటే..

నారా బ్రహ్మాణి పోస్ట్..

ఎక్కువ మంది చదివినవి : Aishwarya Rajesh: అతడంటే క్రష్ కాదు పిచ్చి ఇష్టం.. తన కోసం చాలా ట్రై చేశా.. కానీ అంతలోనే తిరిగిరాని లోకాలకు.. ఐశ్వర్య రాజేశ్..

Follow Us