AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: తిరుమల క్యూలైన్‌లో కలకలం.. ఓ భక్తురాలికి పాముకాటు..

తిరుమల భక్తుల క్యూలైన్‌లో పాము కలకలం రేపింది. రూ.300 దర్శన క్యూలైన్‌లో.. ఓ భక్తురాలిని పాము కాటేసింది.. దీంతో అప్రమత్తమైన తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది.. ఆమెను అశ్విని ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు.. అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి స్విమ్స్‌‌కు తరలించి చికిత్స అందించారు.

Tirumala: తిరుమల క్యూలైన్‌లో కలకలం.. ఓ భక్తురాలికి పాముకాటు..
Snake Bite in Tirumala
Shaik Madar Saheb
|

Updated on: Feb 23, 2026 | 9:14 AM

Share

తిరుమల భక్తుల క్యూలైన్‌లో పాము కలకలం రేపింది. రూ.300 దర్శన క్యూలైన్‌లో.. ఓ భక్తురాలిని పాము కాటేసింది.. దీంతో అప్రమత్తమైన తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది.. ఆమెను అశ్విని ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు.. అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి స్విమ్స్‌‌కు తరలించి చికిత్స అందించారు. చికిత్స అనంతరం తెలంగాణలోని భూపాలపల్లి చెందిన మౌనిక (27) కోలుకుందని.. టీటీడీ అధికారులు ప్రకటించారు. మౌనిక కోలుకుని.. స్వస్థలానికి చేరుకుందని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.

రూ.300 SED క్యూలైన్ లో భక్తురాలు.. మౌనికను ఆదివారం పాము కాటేసిందని.. చికిత్స అనంతరం ఆమె స్వస్థలానికి చేరుకుందని అధికారులు తెలిపారు.

వీడియో చూడండి..

కాగా.. క్యూలైన్లు సహా తిరుమల వ్యాప్తంగా తరచూ పాములు, జంతువుల సంచారం ఉంటుంది. వాటిని సిబ్బంది వెంటనే రెస్క్యూ చేసి.. అనంతరం అడవుల్లో వదలిపెడుతూ ఉంటారు. ఎక్కడైనా పాములు సహా.. జంతువులు ఎక్కడైనా కనిపిస్తే.. వెంటనే సిబ్బందికి సమాచారం ఇవ్వాలని పేర్కొంటున్నారు టీటీడీ అధికారులు..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us