AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా లైఫ్ టర్న్ చేసింది ఆ హీరోనే.. ఆయనే స్టార్ డైరెక్టర్స్‌కు పరిచయం చేశాడన్న అజయ్

టాలీవుడ్ నటుడు అజయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చెప్పక్కర్లేదు. తెలుగు సినిమాల్లో నటుడిగా, విలన్ గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అటు భయంకరమైన విలన్ గా నటిస్తూనే.. ఇటు తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉంటున్నారు

నా లైఫ్ టర్న్ చేసింది ఆ హీరోనే.. ఆయనే స్టార్ డైరెక్టర్స్‌కు పరిచయం చేశాడన్న అజయ్
Ajay
Rajeev Rayala
|

Updated on: Feb 23, 2026 | 9:23 AM

Share

తెలుగు సినిమా పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న నటుడు అజయ్. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు అజయ్. విలన్ గా మెప్పించాడు, సహాయక నటుడిగా ఆకట్టుకున్నాడు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. రవితేజ హీరోగా నటించిన ‘విక్రమార్కుడు’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అజయ్. అందులో అతను పోషించిన టిట్లా పాత్ర ఎప్పటికీ గుర్తుండి పోతుంది. ఆర్య 2, దూకుడు, రాజన్న, ఇష్క్, గబ్బర్ సింగ్, అల వైకుంఠ పురం, సరిలేరు నీకెవ్వరు, 18 పేజీస్‌,విరూపాక్ష, పుష్ప, సరిపోదా శనివారం, మారుతీ నగర్ సుబ్రమణ్యం, గుంటూరు కారం, మత్తు వదలరా 2, దేవర పార్ట్-1, పుష్ప 2, మజాకా ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించాడు అజయ్.

సారాయి వీర్రాజు సినిమాతో హీరోగా అదృష్టం పరీక్షించుకున్న అజయ్ గతేడాది ఏకంగా 10 సినిమాల్లో నటించాడు. ఇటీవలే విడుదలవుతున్న సినిమాల్లో దాదాపు అన్ని సినిమాల్లో అజయ్ కనిస్తారు. అంత బిజీ ఆర్టిస్ట్ ఆయన. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ విశేషాలను పంచుకున్నారు. అజయ్, తన కెరీర్ ఆరంభం గురించి మాట్లాడుతూ.. మొదట్లో తనకు సినిమా రంగంపై ప్రత్యేక ఆసక్తి లేదని వెల్లడించారు. అతడు సినిమా కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు తన పేరును సూచించారని అజయ్ గుర్తు చేసుకున్నారు. అతడు సినిమా తన కెరీర్‌లో ఒక ముఖ్యమైన మలుపు అని తెలిపారు అజయ్.

సాధారణంగా మహేష్ బాబు ఇతర నటులను రికమెండ్ చేయడం చాలా అరుదు అని అజయ్ పేర్కొన్నారు. కానీ, తనను పరిచయం చేసి, మంచి నటుడని దర్శకులకు చెప్పారని వివరించారు. విజయవాడలో పుట్టి పెరిగిన అజయ్, తన తండ్రి సూచన మేరకు ఇంజనీరింగ్ కోర్సులో చేరినప్పటికీ, దానిని పూర్తి చేయలేకపోయానని చెప్పారు.  ఆ తర్వాత ఐసిడబ్ల్యుఏ వంటి ఇతర కోర్సుల వైపు కూడా ప్రయత్నించినట్లు పేర్కొన్నారు. విజయవాడ నుండి సినిమా పరిశ్రమలో నంది అవార్డు వరకు ఆయన ప్రయాణం ఒక సుదీర్ఘమైన, స్ఫూర్తిదాయకమైన గమనం అని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us