AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ‘మా ఎంపీ తీసుకొచ్చిన పసుపు బోర్డు ఇదే..’ రాజకీయ దుమారం రేపుతున్న ఫ్లెక్సీలు.. కారణం ఏమిటంటే..?

నిజమాబాద్‌కు చెందిన పలువురు ‘మా ఎంపీ తీసుకొచ్చిన పసుపు బోర్డు ఇదే..’ అంటూ ఎంపీ అరవింద్‌కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో నిజమాబాద్‌లో రాజకీయ దుమారం..

Telangana: ‘మా ఎంపీ తీసుకొచ్చిన పసుపు బోర్డు ఇదే..’ రాజకీయ దుమారం రేపుతున్న ఫ్లెక్సీలు.. కారణం ఏమిటంటే..?
Flexes against MP Aravind in Nizamabad
శివలీల గోపి తుల్వా
|

Updated on: Mar 31, 2023 | 8:33 AM

Share

తెలంగాణలో పసుపు బోర్డు గానీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గానీ ఏర్పాటు చేసే ప్రతిపాదనలు తమ వద్ద లేవని కేంద్ర తేల్చి చెప్పింది. ఈ మేరకు పార్లమెంట్‌లో లిఖితపూరక సమాధానం ఇచ్చింది. అయితే నిజామాబాద్‌కు పసుపు బోర్డు తీసుకొస్తానంటూ తెలంగాణ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పలు సందర్భాల్లో హామీ ఇచ్చారు. ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో ప్రధాన చర్చ. అంతేకాక నిజమాబాద్‌కు చెందిన పలువురు ‘మా ఎంపీ తీసుకొచ్చిన పసుపు బోర్డు ఇదే..’ అంటూ ఎంపీ అరవింద్‌కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో నిజమాబాద్‌లో రాజకీయ దుమారం రేగినట్లయింది.

గురువారం బీఆర్‌ఎస్ ఎంపీలు వెంకటేష్ నేత, పీ దయాకర్, జీ రంజిత్ రెడ్డి, మాలోతు కవిత అడిగిన ప్రశ్నలకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. సుగంధ ద్రవ్యాల బోర్డు చట్టం-1986 ప్రకారం ఏర్పాటు చేసిన స్పైసెస్ బోర్డు, పసుపు, కొత్తిమీర, మిరపకాయలతో సహా 52 సుగంధ ద్రవ్యాలను ప్రోత్సహించే బాధ్యతను రాష్ట్రాలకు అప్పగించినట్లు అనుప్రియ పటేల్ తెలిపారు. అంతేకాక దేశంలో పసుపు బోర్డు లేదా మరేదైనా మసాలా దినుసుల బోర్డును ఏర్పాటు చేసే ప్రతిపాదన పరిశీలనలో లేదని ఆమె తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు ఖాజీపేట్‌లో రైల్ కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసే ప్రతిపాదన కూడా తమ వద్ద లేదని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం- 2014లో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణకు రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని మంజూరు చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వానికి ఉందా లేదా అని బీఆర్‌ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు లోక్‌ సభలో అడిగిన ప్రశ్నకు వైష్ణవ్ సమాధానం ఇచ్చారు. రోలింగ్ స్టాక్‌ల అవసరాన్ని బట్టి రైల్వేలో రైల్ కోచ్ ఫ్యాక్టరీలు మంజూరవుతాని అశ్విని వైష్ణవ్ వివరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..