- Telugu News Photo Gallery Cricket photos IPL 2023: Here is the List of top 5 Most Run Getters in IPL History From Virat Kohli to Suresh Raina
IPL 2023: ధనాధన్ టోర్నీ తోపులు వీళ్లే.. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 బ్యాట్స్‌మెన్ వివరాలు..
నేటి నుంచే ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభ కాబోతోంది. మొదటి మ్యాచ్‌లో ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్, హార్ధిక్ పాండ్యా నాయకత్వంలోని గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. అయితే ఐపీఎల్ అంటేనే వినోదాల పంట.. పరుగుల మోత. మరి ఇప్పటివరకు 15 ఎడిషన్స్ జరిగిన ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 బ్యాట్స్‌మెన్ ఎవరో మనం ఇప్పుడు చూద్దాం..
Updated on: Mar 31, 2023 | 6:37 AM

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ లిస్టులో కింగ్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో 215 ఇన్నింగ్స్ ఆడిన విరాట్.. మొత్తంగా 6,624 పరుగులు రాబట్టాడు. విశేషమేమిటంటే.. ఇప్పటివరకు కోహ్లీ ఐపీఎల్‌లో ఆడిన ప్రతి మ్యాచ్ కూడా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫునే ఆడాడు.

కింగ్ కోహ్లీ తర్వాత ఈ లిస్టులో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ ఉన్నాడు. తన ఐపీఎల్ కెరీర్‌లో 206 ఇన్నింగ్స్ ఆడిన ధావన్.. మొత్తం 6,284 పరుగులు చేశాడు.

ఈ లిస్టులో ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ కూడా ఉన్నాడు. మొత్తం 5,937 పరుగులు చేసిన వార్నర్ మామ ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్‌గా నిలిచాడు. ఇందుకోసం వార్నర్ 163 ఇన్నింగ్స్ తీసుకున్నాడు.

ఇక టాప్ 5లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. ఐపీఎల్ తొలి 3 సీజన్లలో డెక్కన్ చార్జర్స్, ఆ తర్వాత ముంబై ఇండియన్స్‌తోనే ఉన్న హిట్ మ్యాన్ 41 సార్లు ఈ ఫీట్ అందుకున్నాడు.

అలాగే ఐపీఎల్ పరుగుల వీరులలో సురేష్ రైనా కూడా ఉన్నాడు. మొత్తం 5,528 పరుగులు చేసిన సురేష్ రైనా.. అందుకోసం 200 ఇన్నింగ్స్ తీసుకున్నాడు.




