IPL 2023 Live Stream: నేటి నుంచే ఐపీఎల్ ప్రారంభం.. ఉచితంగా ఎక్కడ ఎలా చూడొచ్చంటే.?

IPL 2023 TV Streaming Channels: మార్చి 31న జరిగే తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, డిఫెండింగ్ చాంపియన్స్ గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. 10 జట్ల మధ్య మొత్తం 70 లీగ్ మ్యాచ్‌లు, ఆ తర్వాత ప్లేఆఫ్స్‌..

IPL 2023 Live Stream: నేటి నుంచే ఐపీఎల్ ప్రారంభం.. ఉచితంగా ఎక్కడ ఎలా చూడొచ్చంటే.?
Ipl 2023 Live Streaming
Follow us

|

Updated on: Mar 31, 2023 | 10:56 AM

IPL 2023 Live: కలర్‌ఫుల్ క్రికెట్ టోర్నమెంట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ ప్రారంభానికి సమయం ఆసన్నమైంది. శుక్రవారం అంటే మార్చి 31న జరిగే తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, డిఫెండింగ్ చాంపియన్స్ గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. 10 జట్ల మధ్య మొత్తం 70 లీగ్ మ్యాచ్‌లు, ఆ తర్వాత ప్లేఆఫ్స్‌ జరుగుతాయి. ప్లేఆఫ్స్‌ తర్వాత ఐపీఎల్ 2023 ఫైనల్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్‌లన్నింటినీ ఎక్కడ ఎలా చూడాలో మీకు తెలుసా..? గతేడాది లాగా కాకుండా.. ఈ ఏడాది మీరు హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ లేకుండానే ఐపీఎల్ మ్యాచ్‌లను వీక్షించవచ్చు. అవును, స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్‌లో వీక్షించవచ్చు. అంతేకాక Jio సినిమా వెబ్ ద్వారా, ఇంకా Jio సినిమా యాప్‌లో కూడా ప్రత్యక్షంగా చూడవచ్చు.

అలాగే విదేశాల్లో ఉన్న వారు ఇప్పటికే జియో సినిమా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నట్లయితే వారు కూడా ఐపీఎల్ మ్యాచ్‌లను ఉచితంగా వీక్షించవచ్చు. అయితే ఆయా దేశాలలో జియో స్ట్రీమింగ్ అందుబాటులో లేకుంటే, VPN ద్వారా ఐపీఎల్ ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు. అలాగే, భారతదేశంలోని స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్‌ల ద్వారా టీవీలో మ్యాచ్‌లను వీక్షించవచ్చు.

ఏయే చానల్స్‌లో ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు అంటే..

  • స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్ HD1
  • స్టార్ స్పోర్ట్స్ 1 SD
  • స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ
  • స్టార్ స్పోర్ట్స్ కన్నడ
  • స్టార్ స్పోర్ట్స్ 1
  • స్టార్ స్పోర్ట్స్ తెలుగు
  • స్టార్ స్పోర్ట్స్ 1 HD (హిందీ)
  • స్టార్ స్పోర్ట్స్ తమిళం
  • స్టార్ స్పోర్ట్స్ 3
  • స్టార్ స్పోర్ట్స్ HD 3 (ఇంగ్లీష్)

ఒకవేళ మీరు విదేశాల్లో ఉన్నట్లయితే, IPL ప్రత్యక్ష ప్రసారాన్ని ఈ కింది చానల్స్‌, యాప్‌లలో చూడవచ్చు..

ఇవి కూడా చదవండి
  • UK- ITVX
  • ఆస్ట్రేలియా- FOX Sports
  • కెనడా- Willow TV
  • మిడిల్ ఈస్ట్ – beIN Sports 3
  • దక్షిణాఫ్రికా- Super Sports
  • న్యూజిలాండ్ – Sky Sport NZ, Sky Sport  2
  • పాకిస్తాన్- Jio Super(TBC)
  • బంగ్లాదేశ్- Channel 9
  • మాల్దీవులు- YuppTv, Medianet

చెన్నై సూపర్ కింగ్స్ vs గుజరాత్ టైటాన్స్

ఐపీఎల్ 16వ సీజన్ తొలి మ్యాచ్‌లో 4 సార్లు టోర్నీ విజేత అయిన చెన్నై సూపర్ కింగ్స్, డిఫెండింగ్ చాంపియన్స్ గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఈ క్రమంలో చెన్నైకి ఎంఎస్ ధోని, గుజరాత్‌కు హార్దిక్ పాండ్యా నాయకత్వం వహిస్తున్నారు. అయితే ఏప్రిల్ 2 వరకు ఐపీఎల్ టోర్నీలో జరిగే  ఏ మ్యాచ్‌లోనూ దక్షిణాఫ్రికా ప్లేయర్లు ఉండబోరు. ఇక గుజరాత్‌లో డెవిడ్ మిల్లర్, చెన్నైలో డ్యైన్ ప్రెటోరియస్, సిసండా మగలా దక్షిణాఫ్రికా నుంచి ఉన్నారు.  ప్రస్తుతం ఆ దేశం నెదర్లాండ్స్‌తో వన్డే సిరీస్ ఆడడమే అందుకు కారణం. మరోవైపు చెన్నై సారథి ధోని కూడా అందుబాటులో ఉండకపోవచ్చు. ప్రాక్టీస్ సమయంలో ధోనికి గాయం అయినందున తొలి మ్యాచ్‌లో ఈ టీమిండియా మాజీ సారథి ఆడకపోవచ్చు..

మరిన్ని క్రికెట్  వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..