IPL 2023: హైదరాబాదీలకు అసలైన క్రికెట్ మజా.. సన్‌రైజర్స్ హోమ్ మ్యాచ్‌ల జాబితా ఇదే.
కరోనా పుణ్యామాని మూడేళ్లుగా ఐపీఎల్ మ్యాచ్‌లు హోమ్ గ్రౌండ్స్ జరగలేవు. దీంతో తమ అభిమాన ప్లేయర్స్‌ను లైవ్‌లో చూద్దామని ఆశించిన అభిమానుల ఆశలు నిరాశలయ్యాయి. అయితే ఐపీఎల్ తాజా సీజన్ 2023లో మాత్రం ఆ నిరాశకు బ్రేక్ పడనుంది...
కరోనా పుణ్యామాని మూడేళ్లుగా ఐపీఎల్ మ్యాచ్‌లు హోమ్ గ్రౌండ్స్ జరగలేవు. దీంతో తమ అభిమాన ప్లేయర్స్‌ను లైవ్‌లో చూద్దామని ఆశించిన అభిమానుల ఆశలు నిరాశలయ్యాయి. అయితే ఐపీఎల్ తాజా సీజన్ 2023లో మాత్రం ఆ నిరాశకు బ్రేక్ పడనుంది. కరోనాలాంటి ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో దేశంలోని వివిధ పట్టణాల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. శుక్రవారం నుంచి ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభమవుతోన్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ఏయే రోజుల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం.
2019 తర్వాత హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనుంది మళ్లీ ఇప్పుడే. ఈ సీజన్ సన్‌రైజర్స్ హోం గ్రౌండ్‌లో మొత్తం 7 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఏప్రిల్ 2, 9, 18, 24, మే 4, 13, 18 తేదీల్లో సన్‌రైజర్స్ మ్యాచ్‌లు హైదరాబాద్‌లో జరగనుండగా.. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మినహా.. అన్ని జట్లతోనూ హైదరాబాద్ టీం తన హోం గ్రౌండ్‌లో తలపడనుంది.
ఇక హైదరాబాద్‌లో జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఏయే జట్లతో, ఏ రోజు తలపడనుందంటే.. ఏప్రిల్ 2వ తేదీన రాజస్థాన్ రాయల్స్‌తో, ఏప్రిల్ 9వ తేదీన పంజాబి కింగ్స్‌తో, ఏప్రిల్ 18వ తేదీన ముంబై ఇండియన్స్‌తో, ఏప్రిల్ 24వ తేదీన ఢిల్లీ క్యాపిటల్స్‌తో, మే 4వ తేదీన కోల్‌కతా నైట్ రైడర్స్‌తో, మే 13వ తేదీన లక్నో సూపర్ జెయింట్స్‌తో, మే 18వ తేదీన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సన్‌రైజర్స్ హోమ్ గ్రౌండ్‌లో తలపడనుంది. మరెందుకు ఆలస్యం ఆ షెడ్యూల్‌కు అనుగుణంగా టికెట్స్‌ను బుక్ చేసుకొని అసలైన క్రికెట్ మజాను పొందండి.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం క్లిక్ చేయండి..