IPL 2023: ధోని దూరం.. కెప్టెన్‌గా స్టోక్స్? తుది జట్టులో హార్డ్ హిట్టర్లు.. ఆ ముగ్గురే కీలకం.!

క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2023 సీజన్‌కు రంగం సిద్దమైంది. శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా తొలి మ్యాచ్‌లో..

IPL 2023: ధోని దూరం.. కెప్టెన్‌గా స్టోక్స్? తుది జట్టులో హార్డ్ హిట్టర్లు.. ఆ ముగ్గురే కీలకం.!
Csk Vs Gt
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 31, 2023 | 8:19 AM

క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2023 సీజన్‌కు రంగం సిద్దమైంది. శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలబడతాయి. ఇరు జట్లూ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఈ రెండు జట్లకు కీలక ఆటగాళ్లు తొలి మ్యాచ్‌కు దూరం కానున్నారు. కొందరు జాతీయ జట్టు డ్యూటీలో ఉండగా.. మరికొందరు గాయాలు కారణంగా దూరమయ్యారు.

ఇదిలా ఉండగా.. ప్రాక్టీస్ సెషన్‌లో బ్యాటింగ్ చేస్తూ ధోని గాయపడినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో అతడికి తొలి మ్యాచ్‌కు విశ్రాంతి ఇవ్వాలని సీఎస్‌కే వైద్యబృందం సూచించినట్లు సమాచారం. కానీ దీనిపై ఆ ఫ్రాంచైజీ సీఈఓ క్లారిటీ ఇచ్చాడు. ధోని వంద శాతం ఫిట్‌గా ఉన్నాడని.. మొదటి మ్యాచ్ ఆడతాడని స్పష్టం చేశాడు. ఒకవేళ ధోని మొదటి మ్యాచ్‌కు దూరమైతే.. కెప్టెన్‌గా బెన్ స్టోక్స్ వ్యవహరించే అవకాశం ఉంది. ధోని టీం.. విధ్వంసకర ఓపెనర్లు, టీ20 ఫినిషర్లతో బరిలోకి దిగుతుంటే.. గుజరాత్ టైటాన్స్ మరోసారి విన్నింగ్ టీం కాంబినేషన్‌లో దిగుతోంది.

చెన్నై సూపర్ కింగ్స్(ప్లేయింగ్ 11- అంచనా):

డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, శివం దూబే, అంబటి రాయుడు, బెన్ స్టోక్స్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మతీషా పతిరన

గుజరాత్ టైటాన్స్(ప్లేయింగ్ 11 – అంచనా):

శుభ్‌మాన్ గిల్, వృద్ధిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, హార్దిక్ పాండ్యా, విజయ్ శంకర్, మాథ్యూ వేడ్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, శివమ్ మావి, మహమ్మద్ షమీ, జాషువా లిటిల్

ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే