AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit-IPL 2023: ఫ్యాన్స్‌కి ఆందోళన అవసరం లేదు.. కెప్టెన్స్ ఫోటోషూట్‌కి హిట్‌మ్యాన్ రాకపోవడానికి కారణమిదే..

ఐపీఎల్ 16వ సీజన్ తొలి మ్యాచ్‌కు ముందు రోజు కెప్టెన్స్ ఫోటోషూట్ నిర్వహించారు. దీనికి ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మినహా.. మిగిలిన 9 జట్లకు చెందిన కెప్టెన్స్..

Rohit-IPL 2023: ఫ్యాన్స్‌కి ఆందోళన అవసరం లేదు.. కెప్టెన్స్ ఫోటోషూట్‌కి హిట్‌మ్యాన్ రాకపోవడానికి కారణమిదే..
Rohit Sharma; Ipl 2023
శివలీల గోపి తుల్వా
|

Updated on: Mar 31, 2023 | 9:46 AM

Share

ఐపీఎల్ 16 సీజన్‌కి సమయం ఆసన్నమయింది. నేటి నుంచి అంటే మార్చి 31 నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రారంభమవుతున్నాయి. ఇక మొదటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. అయితే మ్యాచ్‌కు ఒక రోజు ముందు.. గురువారం కెప్టెన్స్ ఫొటో షూట్‌ నిర్వహించారు. తొలి మ్యాచ్‌కి వేదిక అయిన అహ్మదాబాద్‌ నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ ఫోటోషూట్ జరిగింది. దీనిలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మినహా.. మిగిలిన 9 జట్లకు చెందిన కెప్టెన్స్ హాజరయ్యారు. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ అందుబాటులో లేకపోవడంతో అతని స్థానంలో వైస్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ ఈ షూట్‌లో పాల్గొన్నాడు.

కానీ.. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ముంబైలోనే ఉన్నా కెప్టెన్స్ ఫోటోషూట్‌కి రాలేదు. అందుబాటులో ఉన్నప్పటికీ ఐపీఎల్ కెప్టెన్స్ ఫోటోషూట్‌కి హిట్ మ్యాన్ గైర్హాజరీ అదరినీ ఆశ్చర్యపరిచింది. ఇదిలా ఉండగా.. రోహిత్ శర్మకి గాయమైందని అందుకే షూట్‌కి దూరంగా ఉన్నాడనే వార్తలు సోషల్ మీడియా వేదికగా ఊపందుకున్నాయి. ఈ కారణంతోనే ఆదివారం(ఏప్రిల్ 2) ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్‌కి కూడా హిట్‌మ్యాన్ దూరంగా ఉండబోతున్నట్లు కూడా ప్రచారం జరిగింది. కానీ.. అసలు కారణం తాజాగా వెలుగులోకి వచ్చింది.

అదేమిటంటే.. రోహిత్ శర్మ అనారోగ్యం కారణంగానే అహ్మదాబాద్‌లో జరిగిన కెప్టెన్స్ ఫోటోషూట్‌కి దూరంగా ఉన్నాడని ముంబై ఇండియన్స్ టీమ్ వర్గాలు తెలిపాయి. అలానే బెంగళూరుతో ఆదివారం జరిగే మ్యాచ్‌కి అతను అందుబాటులో ఉంటాడని కూడా స్పష్టం చేశాయి. సమస్య చిన్నదేనని, ఫ్యాన్స్ కంగారు పడనవసరంలేదని టీమ్ మేనేజ్‌మెంట్ తెలిపింది. దీంతో అటు ముంబై అభిమానులు, ఇటు హిట్ మ్యాన్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఇక బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ముంబై, బెంగళూరు జట్లు ఆదివారం రాత్రి 7.30 నిముషాలకు తలపడనున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్  వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
జూలై నెలలోనూ నిరాశే.. వర్షాలు అంతంత మాత్రమే!
జూలై నెలలోనూ నిరాశే.. వర్షాలు అంతంత మాత్రమే!
బ్యాంకింగ్‌ రంగంలో విప్లవం.. ATM పిన్ చరిత్ర తెలుసా
బ్యాంకింగ్‌ రంగంలో విప్లవం.. ATM పిన్ చరిత్ర తెలుసా
గ్యాస్‌ వినియోగదారులకు శుభవార్త.. సిలిండర్‌పై రూ.183.50 తగ్గింపు!
గ్యాస్‌ వినియోగదారులకు శుభవార్త.. సిలిండర్‌పై రూ.183.50 తగ్గింపు!
సోలార్ పవర్డ్ స్మార్ట్ బెంచీలు.. రిలాక్స్ అండ్ ఛార్జ్
సోలార్ పవర్డ్ స్మార్ట్ బెంచీలు.. రిలాక్స్ అండ్ ఛార్జ్
టీ vs కాఫీ.. ఉదయాన్నే ఏది తాగితే మీ ఎముకల బలానికి మంచిది..?
టీ vs కాఫీ.. ఉదయాన్నే ఏది తాగితే మీ ఎముకల బలానికి మంచిది..?
మామిడి, టమాటా, ఉసిరి, నిమ్మకాయ.. అబ్బ పచ్చళ్ళు అనుకుంటున్నారా..?
మామిడి, టమాటా, ఉసిరి, నిమ్మకాయ.. అబ్బ పచ్చళ్ళు అనుకుంటున్నారా..?
నేటి నుంచి మళ్లీ అందుబాటులోకి పీఎఫ్ ఆన్ లైన్ సేవలు..
నేటి నుంచి మళ్లీ అందుబాటులోకి పీఎఫ్ ఆన్ లైన్ సేవలు..
ఖాళీ కడుపుతో బెల్లం తింటే, కోట్ల రూపాయలు ఇచ్చినా దొరకని ఆరోగ్యం!
ఖాళీ కడుపుతో బెల్లం తింటే, కోట్ల రూపాయలు ఇచ్చినా దొరకని ఆరోగ్యం!
గంభీర్ vs వైభవ్.. బుడ్డోడిని ఆడించక పోవడానికి అసలు కారణం ఇదేనంట?
గంభీర్ vs వైభవ్.. బుడ్డోడిని ఆడించక పోవడానికి అసలు కారణం ఇదేనంట?
పెట్రోల్, డీజిల్ కాదు.. సైనికుల వాహనాలు నడిచేది దానితోనే
పెట్రోల్, డీజిల్ కాదు.. సైనికుల వాహనాలు నడిచేది దానితోనే