Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending: నెట్టింట షారుఖ్‌ ఖాన్, విరాట్ కోహ్లీ అభిమానుల మధ్య ట్విట్టర్ వార్.. కారణం ఏమిటంటే..?

సోషల్ మీడియాలో నెటిజన్లు వారి వారి అభిప్రాయాలను స్వేచ్ఛగా తెలియజేస్తుంటారు. అయితే కొన్ని సందర్భాలలో అవి వివాదాస్పదంగా, మరి కొన్ని సందర్భాలలో సరదాగా ఉంటాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం.

Trending: నెట్టింట షారుఖ్‌ ఖాన్, విరాట్ కోహ్లీ అభిమానుల మధ్య ట్విట్టర్ వార్..  కారణం ఏమిటంటే..?
Shah Rukh Khan And Virat Kohli
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 30, 2023 | 1:39 PM

సోషల్ మీడియాలో నెటిజన్లు వారి వారి అభిప్రాయాలను స్వేచ్ఛగా తెలియజేస్తుంటారు. అయితే కొన్ని సందర్భాలలో అవి వివాదాస్పదంగా, మరి కొన్ని సందర్భాలలో సరదాగా ఉంటాయి. ఇక ఐపీఎల్ 16వ సీజన్‌కి ఇంకా ఒక్క రోజే మిగిలి ఉన్న క్రమంలోనే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో టీమిండియా రన్ మిషిన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ యాక్టర్ షారుఖ్ ఖాన్ అభిమానుల మధ్య పోటీ పోల్ జరుగుతోంది. అవును, నటుడికి, క్రికెటర్‌కి మధ్య పోల్ ఏమిటని ఆశ్చర్యపడుతున్నారా..? కానీ ఇది నిజం. Slog Sweep-189 అనే ట్విటర్ ఖాతాదారుడు ‘ ప్రపంచంలో ఎవరు ఎక్కువ ప్రసిద్ధి పొందారు..?’ అనే పోల్ ఏర్పాటు చేసి ఎ) షారుఖ్ ఖాన్, బి) విరాట్ కోహ్లీ..  అని ఆప్షన్స్ ఇచ్చాడు. దీంతో పోల్‌పై స్పందించిన నెటిజన్లు రకరకాల మిమ్స్‌తో నెట్టింట హల్‌చల్ చేస్తున్నారు. ఇంకా షారుఖ్ ఖాన్, విరాట్ కోహ్లీ అభిమానుల మధ్య ట్విట్టర్ వార్ మొదలైంది.

మరోవైపు ఈ పోల్‌లో కోహ్లీకి 54.4% ఓట్లు, షారూఖ్‌కి ​​45.6% ఓట్లు వచ్చాయి. అయితే పోల్ ముగిసినా సోషల్ మీడియాలో చర్చకు ముగింపు పలకలేదు. ఈ క్రమంలో నెట్టింట వైరల్ అవుతున్న మిమ్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..