Viral: ప్రైవేట్ పార్టులో తీవ్రమైన నొప్పి.. తట్టుకోలేక డాక్టర్ దగ్గరకెళ్లిన వ్యక్తి.. ఎక్స్‌రే చూడగా..

ఓ వ్యక్తికి నడక మారింది. నొప్పి తీవ్రతరమైంది. తన పరిస్థితి ఏంటో తెలియదు.. రోజురోజుకీ నొప్పి పెరుగుతూపోతోంది.

Viral: ప్రైవేట్ పార్టులో తీవ్రమైన నొప్పి.. తట్టుకోలేక డాక్టర్ దగ్గరకెళ్లిన వ్యక్తి.. ఎక్స్‌రే చూడగా..
Viral
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 03, 2023 | 10:06 AM

ఓ వ్యక్తికి నడక మారింది. నొప్పి తీవ్రతరమైంది. తన పరిస్థితి ఏంటో తెలియదు.. రోజురోజుకీ నొప్పి పెరుగుతూపోతోంది. ఇంకేం చేయాలో తెలియక డాక్టర్ దగ్గరకు వెళ్లాడు. స్కాన్ చేసి చూడగా ఎక్స్‌రేలో కనిపించింది చూసి.. దెబ్బకు ఫ్యూజులు ఎగిరిపోయాయి.. ఇంతకీ అసలేం జరిగిందంటే..

వివరాల్లోకి వెళ్తే.. కొలంబియాలోని బారానోయికు చెందిన 40 ఏళ్ల వ్యక్తి తన ప్రైవేటు పార్టులో తీవ్రమైన నొప్పితో నడవలేక.. చివరికి హాస్పిటల్‌కు వచ్చాడు. అక్కడున్న డాక్టర్లు అతడికి పలు పరీక్షలు నిర్వహించి.. ఎక్స్‌రే తీశారు. ఇక వారికి అందులో కనిపించిన వస్తువు చూసి దెబ్బకు షాకయ్యారు. వెంటనే ఆపరేషన్ చేసి దాన్ని బయటికి తీయడంతో.. అది సొరకాయ అని గుర్తించారు. మల ద్వారం నుంచి ఆ సొరకాయ లోపలికి వెళ్లిందని డాక్టర్లు నిర్ధారించుకున్నారు. అంతా సజావుగా జరగడంతో ఆపరేషన్ అనంతరం.. పేషెంట్‌ను సొరకాయ ఎలా బాడీలోకి వెళ్లిందని అడగ్గా.. తాను ఎక్కువగా సొరకాయలు తింటుంటానని.. వాటి గింజల ద్వారా తన కడుపులో సొరకాయ పెరిగిందని చెప్పాడు. కానీ అతడు చెప్పిన మాటలను నమ్మని వైద్యులు.. చివరికి పేషెంట్‌ను ఇంటికి పంపించారు.(Source)