IPL-Virat Kohli: ప్రమాదంలో క్రిస్‌గేల్ రికార్డు.. కింగ్ కోహ్లీ కోసం ఎదురుచూస్తున్న లెక్కలివే..

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో అందరి దృష్టి బెంగళూరు జట్టు మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మ్యాన్  విరాట్ కోహ్లీపైనే ఉంది. ఐపీఎల్‌లో ఇప్పటికే ఎన్నో రికార్డులు సృష్టించిన కింగ్ కోహ్లి.. 2023లో ఐపీఎల్‌లో

IPL-Virat Kohli: ప్రమాదంలో క్రిస్‌గేల్ రికార్డు.. కింగ్ కోహ్లీ కోసం ఎదురుచూస్తున్న లెక్కలివే..
Virat Kohli Ipl
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 30, 2023 | 11:35 AM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ ప్రారంభం కావడానికి ఇంకా ఒక్క రోజు మాత్రమే ఉంది. అయితే గత 15 సీజన్లుగా కప్ గెలవలేకపోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఈ సారైనా తన చిరకాల కోరికను తీర్చుకోవాలని తహతహలాడుతోంది. ఈ నేపథ్యంలోనే ఆర్‌సీబీ ఆటగాళ్లు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కఠోరమైన ప్రాక్టీస్ చేస్తున్నారు. మరోవైపు ఈ ఐపీఎల్‌ సీజన్‌లో అందరి దృష్టి బెంగళూరు జట్టు మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మ్యాన్  విరాట్ కోహ్లీపైనే ఉంది. ఐపీఎల్‌లో ఇప్పటికే ఎన్నో రికార్డులు సృష్టించిన కింగ్ కోహ్లి.. 2023లో ఐపీఎల్‌లో సరికొత్త రికార్డు సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడు. పరిస్థితులు సహకరిస్తే కోహ్లీ ఈ సీజన్‌లో కూడా కొన్ని అరుదైన రికార్డులను సృ‌ష్టించగలడు. మరి కోహ్లీ కోసం ఎదురుచూస్తున్న ఐపీఎల్ రికార్డులేమిటో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్‌ సెంచరీలు: కింగ్ కోహ్లీ కొన్నేళ్లుగా ఐపీఎల్‌ సెంచరీ చేయలేదు. అయితే ఐపీఎల్ 16వ సీజన్‌లో క్రిస్‌గేల్ రికార్డు ప్రమాదంలో ఉంది. అవును, ఇప్పటి వరకు 5 సెంచరీలు చేసిన కోహ్లి మరో సెంచరీ సాధిస్తే.. ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన క్రిస్ గేల్(6 సెంచరీలు) రికార్ఢును సమం చేయగలుగుతాడు. అలాగే రెండు సెంచరీలు చేస్తే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్‌గా నిలుస్తాడు.

100 క్యాచ్‌లు: కోహ్లీ అద్భుతమైన ఫీల్డర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 93 క్యాచ్‌లతో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాళ్ల జాబితాలో 4వ స్థానంలో ఉన్నాడు. కోహ్లీ కంటే ముందు సురేష్ రైనా (109), కీరన్ పోలార్డ్(103), రోహిత్ శర్మ(97) తొలి మూడు స్థానాలలో ఉన్నాడు. ఈ టోర్నీలో కోహ్లీ మరో 7 క్యాచ్‌లు పట్టగలిగితే 100 క్యాచ్‌లు పూర్తి చేస్తాడు.

ఇవి కూడా చదవండి

7,000 పరుగులు: ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో కోహ్లి నంబర్ 1 స్కోరర్. 223 మ్యాచ్‌లు ఆడిన కింగ్ కోహ్లీ మొత్తం 6,624 పరుగులు చేశాడు. ఇక ఈ సీజన్‌లో కోహ్లి 376 పరుగులు చేస్తే ఐపీఎల్  చరిత్రలో 7,000 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా కూడా రికార్డులలో నిలుస్తాడు.

కాగా, ఏప్రిల్ 2న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈ 16వ సీజన్‌తో తన తొలి మ్యాచ్ ఆడనుంది. అయితే ముంబై ఇండియన్స్‌తో జరిగే ఈ మ్యాచ్‌కు ఆర్‌సీబీ జట్టులోని ముగ్గురు ఆటగాళ్లు అందుబాటులో ఉండకపోవచ్చు. రజత్ పాటిదార్ పాదాల నొప్పితో బాధపడుతుండగా.. వనిందు హస్రంగ న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. మరోవైపు కాలి గాయం కారణంగా జోష్ హేజిల్‌వుడ్ ఇప్పటికీ జట్టుకు దూరంగా ఉన్నాడు. ఇక ఐపీఎల్ 16వ సీజన్ మొదటి మ్యాచ్‌ రేపు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగనుంది. ఈ మొదటి మ్యాచ్‌లో ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్, హార్దిక్ పాండ్యా నడిపిస్తున్న గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..