Health Tips: మీ చిట్టి గుండెను కాపాడుకోవాలంటే ఈ ఒక్క పండు తింటే చాలు.. పురుషులకు ఇది వరం కూడా..

సంతానలేమి సమస్యలతో బాధపడేవారికి ఖర్బూజ పండు ఎంతగానో మేలు చేస్తుంది. ఇంకా వేసవిలో ఎదురయ్యే డీహైడ్రేషన్, వడదెబ్బ సమస్యలకు కూడా ఇది చక్కని

Health Tips: మీ చిట్టి గుండెను కాపాడుకోవాలంటే ఈ ఒక్క పండు తింటే చాలు.. పురుషులకు ఇది వరం కూడా..
Muskmelon Benefits for Heart Health and Childlessness
Follow us

|

Updated on: Mar 30, 2023 | 10:56 AM

కొన్ని రకాల పండ్లు ఏడాది పొడవునా లభించవు. అవి నిర్ణీత సీజన్లలో మాత్రమే తినేందుకు అవకాశం ఉంటుంది. అయితే అవి తమదైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి.అటువంటి పండ్లలో మామిడి, పుచ్చకాయ, ఖర్బూజ వంటివి వేసవిలో లభించే కొన్ని పండ్లు. ఇక ఖర్బూజ విషయానికి వస్తే దీనిలోని పోషకాలు మన గుండె, జీర్ణక్రియకు ఎంతో ఉపయోగకరం. ముఖ్యంగా సంతానలేమి సమస్యలతో బాధపడేవారికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది. ఇంకా వేసవిలో ఎదురయ్యే డీహైడ్రేషన్, వడదెబ్బ సమస్యలకు కూడా ఇది చక్కని పరిష్కారం.  ఖర్బూజలో అనేక రకాల విటమిన్లు, మినరల్స్, ఫైబర్ వంటి పోషకాలు ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. ఇక ఈ పండులో 95 శాతం నీరు ఉంటుంది. ఫలితంగా ఇది శరీరంలోని వేడిని తగ్గించడంలో  అద్భుతంగా సహాయపడుతుంది. అంతేేకాక  ఎన్నో రకాల వ్యాధులను దూరం చేస్తుంది. మరి ఈ క్రమంలో ఖర్భూజతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..

పురుషులకు వరం: ఖర్బూజలో విటమిన్‌ కె, ఇ పుష్కలంగా ఉండడం వల్ల ప్రత్యుత్పత్తి వ్యవస్థని ఇది బలోపేతం చేస్తుంది. అందుకే సంతానలేమితో బాధపడేవారు ఈ పండును తరుచుగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇక రక్త ప్రసరణ మెరుగు పరచడంలో కూడా ఈ పండు కీలక పాత్ర పోషిస్తుంది.

వడదెబ్బ, డీహైడ్రేషన్: వేసవిలో చాలా మంది ఎదుర్కొనే సమస్యల్లో ఒకటైన వడదెబ్బ, డీహైడ్రేషన్ ప్రధానమైనవి. వీటి నుంచి ఖర్బూజ మిమ్మల్ని రక్షిస్తుంది. ముఖ్యంగా ఎండలో బయటకి వెళ్లే వారు ఖర్బూజ జ్యూస్‌ తాగడం మంచిది.

ఇవి కూడా చదవండి

గుండె ఆరోగ్యం: ఖర్బూజ పండులో ఉండే పొటాషియం వల్ల గుండెకు అవసరమయ్యే న్యూట్రియన్స్‌ అందుతాయి. గుండె పోటు వంటి హృదయ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో ఖర్బూజ ఉపయోగపడుతుంది.

మధుమేహం: కర్బూజ మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఒక వరం. శరీరంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్  చేయడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా కిడ్నీలో రాళ్లను కరిగించడానికి కూడా ఇది ఉత్తమంగా ఉపయోగపడుతుంది.

రోగనిరోధక శక్తి: పుచ్చకాయలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇది మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇమ్యూనిటీ బూస్టింగ్ వల్ల అనేక వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షించుకోవచ్చు.

కళ్ళు: కర్బూజ నుంచి అధిక మొత్తంలో లభించే విటమిన్ ఎ, బీటా కెరోటిన్ కంటిచూపును మెరుగుపరుస్తాయి. కంటిశుక్లం ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది.

జీర్ణక్రియ: వేసవి కాలంలో జీర్ణక్రియ సమస్య తరచుగా ఇబ్బంది పెడుతుంది. అయితే పీచు పదార్థం ఎక్కువగా ఉండే కర్బూజను తీసుకోవడం వల్ల మీరు ఉదర సంబంధిత సమస్యల నుంచి బయటపడతారు. అంతేకాకుండా మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్  వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Latest Articles
ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ అకౌంట్ అంటే ఏంటి? ప్రయోజనం ఏమిటి?
ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ అకౌంట్ అంటే ఏంటి? ప్రయోజనం ఏమిటి?
ఈ ఐదువస్తువులు హనుమంతునికి సమర్పించండి అద్భుత ప్రయోజనాలు మీ సొంతం
ఈ ఐదువస్తువులు హనుమంతునికి సమర్పించండి అద్భుత ప్రయోజనాలు మీ సొంతం
రాజమౌళి రాసిన లెటర్‏ను ఫ్రేమ్ కట్టించిన డైరెక్టర్..
రాజమౌళి రాసిన లెటర్‏ను ఫ్రేమ్ కట్టించిన డైరెక్టర్..
రూ.43 వేల కోట్లు నష్టపోయిన ముఖేష్‌ అంబానీ.. కారణం ఏంటంటే..
రూ.43 వేల కోట్లు నష్టపోయిన ముఖేష్‌ అంబానీ.. కారణం ఏంటంటే..
ఈ రాశివారు అనూహ్యంగా ఒకట్రెండు శుభవార్తలు వింటారు..
ఈ రాశివారు అనూహ్యంగా ఒకట్రెండు శుభవార్తలు వింటారు..
ఏపీ, తెలంగాణలో భానుడి భగభగలు.. వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి..
ఏపీ, తెలంగాణలో భానుడి భగభగలు.. వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో..
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?