AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: 2 వారాల్లో రెండోసారి ఢిల్లీలో పర్యటించిన సీఎం జగన్.. హిటెక్కుతున్న ఏపీ రాజకీయాలు..

జగన్ మోహన్‌ రెడ్డి కూడా వరసగా 15 రోజుల గ్యాప్‌లోనే రెండుసార్లు ఢిల్లీ వెళ్లడంతో రాజకీయ వర్గాల్లో ఊహాలకు అంతే లేకుండా పోయింది. సోమవారం నేతలతో సీఎం సమావేశం ఏర్పాటు చేయడం మరింత..

Andhra Pradesh: 2 వారాల్లో రెండోసారి ఢిల్లీలో పర్యటించిన సీఎం జగన్.. హిటెక్కుతున్న ఏపీ రాజకీయాలు..
Ap Politics
శివలీల గోపి తుల్వా
|

Updated on: Mar 31, 2023 | 7:57 AM

Share

ఏపీలో రాజకీయాలు చకచకా మారిపోతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత అన్ని పార్టీలు పొత్తులు.. ఎత్తులు.. ముందస్తు ఎన్నికలు అంటూ ఎవరికి నచ్చిన రాగం వారు పాడుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో సీఎం జగన్ మోహన్‌ రెడ్డి కూడా వరసగా 15 రోజుల గ్యాప్‌లోనే రెండుసార్లు ఢిల్లీ వెళ్లడంతో రాజకీయ వర్గాల్లో ఊహాలకు అంతే లేకుండా పోయింది. సోమవారం నేతలతో సీఎం సమావేశం ఏర్పాటు చేయడం మరింత హీట్‌ రాజేసింది. ముందస్తు ముచ్చటే ఉండదని గతంలోనే సీఎం పక్కాగా చెప్పారు. అయినా రాష్ట్రంలో అప్పటి పరిస్థితులు వేరు.. ఇప్పుడున్న పరిస్థితులు వేరనే మాట వినిపిస్తోంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రమంత్రులను కలిసినట్టు ప్రకటన విడుదల చేసినా రాజకీయ వర్గాల్లో మాత్రం అంతకుమించిన ఏదో కారణం దాగుందన్న చర్చకు తెరతీశారు.

ఈ నెల 17న ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్మోహన్‌ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా పలువురు మంత్రులను కలిశారు. మళ్లీ రెండు వారాల వ్యవధిలోనే అంటే 29న ఢిల్లీ వెళ్లడం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమైంది. సరిగ్గా ఇదే సమయంలో సోమవారం ఎమ్మెల్యేలు, మంత్రులు, సమన్వయకర్తలతో సమావేశం ఉంటుందని ప్రకటించడం మరింత ఉత్కంఠ రేపుతోంది. గడపగడపకు మీ ప్రభుత్వంపై సమీక్షతో పాటు.. ఎమ్మెల్సీ ఫలితాలు, సీఎం జగన్‌ ఢిల్లీ టూరు నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలోనే ఎమ్మెల్సీ ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవాలని సీఎం వార్నింగ్‌ ఇచ్చారు. ఫలితాల తర్వాత ఓటమిపై రివ్యూతో పాటు.. చర్యలు ఉంటాయన్న వాదన పార్టీలో వినిపిస్తోంది.

మరోవైపు ఎమ్మెల్సీ ఫలితాల తర్వాత టీడీపీ సరికొత్త నినాదం అందుకుంది. వైసీపీలో చాలామంది నేతలు టచ్‌లో ఉన్నారంటోంది ఆ పార్టీ. అయితే ఇదంతా మైండ్‌గేమ్‌ అంటున్న అధికార పార్టీ లైట్‌గా తీసుకుంటోంది. ఇటీవల పొత్తులపై సీపీఐ నారాయణ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. వైసీపీకి వ్యతిరేకంగా బీజేపీ మినహా కాంగ్రెస్‌ సహా పార్టీలన్నీ కలవాలంటున్నారు. దీంతో ఇరాకాటంలో పడ్డ టీడీపీ.. పొత్తులపై సమాధానం దాటవేసింది. ఏపీలో రాజకీయాల్లో డైనమిక్‌ ఛేంజ్‌ కనిపిస్తోంది. ఇంకా ఎన్నికలకు ఏడాది ఉన్నా సరే.. యాక్షన్‌లో దిగుతున్నాయి. మహానాడు నాటికే మేనిఫెస్టోతో సిద్ధంగా ఉంటామని టీడీపీ అంటే.. అంత సమయం కూడా జగన్‌ ఇస్తారా అంటూ చర్చ మొదలైంది..? మరి ఏపీలో ఏం జరగబోతుంది..? అనేది తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే..

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..