G-20 Summit: విశాఖలో జీ-20 సదస్సు.. కీలక అంశాలపై చర్చ..
విశాఖ సాగరతీరంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న జీ-20 సదస్సు ఉత్సాహంగా జరుగుతోంది. వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్ థీమ్‌తో తలపెట్టిన ఈ అంతర్జాతీయ సదస్సు.. ఆర్థికాభివృద్ధిలో పరస్పర సహకారం, వ్యాపార, వాణిజ్యాభివృద్ధిలో పరస్పర ఒప్పందాలపై విస్తృతస్థాయి చర్చలు జరిగాయి.
విశాఖ సాగరతీరంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న జీ-20 సదస్సు ఉత్సాహంగా జరుగుతోంది. వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్ థీమ్‌తో తలపెట్టిన ఈ అంతర్జాతీయ సదస్సు.. ఆర్థికాభివృద్ధిలో పరస్పర సహకారం, వ్యాపార, వాణిజ్యాభివృద్ధిలో పరస్పర ఒప్పందాలపై విస్తృతస్థాయి చర్చలు జరిగాయి. అంతర్జాతీయ ప్రతినిధులు జీ 20 సమ్మిట్‌లో పలు అంశాలపై జరుగుతున్న చర్చల్లో పూర్తిగా నిమగ్నమయ్యారు.
విశాఖపట్నంలో నాలుగు రోజుల పాటు జరిగే G – 20 సమ్మిట్ మూడో రోజు క్షేత్ర పర్యటనతో ఆసక్తికరంగా మారింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు ఆ ప్రతినిధి బృందం విశాఖ లో క్షేత్ర పర్యటన చేపట్టింది. ప్రపంచ దేశాలనుంచి వచ్చిన ప్రతినిధి బృందం.. అంతర్జాతీయ ఆర్థిక సంస్థల సహకారంతో నడుస్తున్న పలు ప్రాజెక్టులను సందర్శించింది.
ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సహకారంతో నడుస్తున్న 24 బై 7 తాగు నీటి సరఫరాని ఈ బృందం పరిశీలించింది. OECD సహకారంతో నిర్మించిన ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ని సైతం అంతర్జాతీయ ప్రతినిధి బృందం సందర్శించంది. ఇక ప్రైవేట్ పెట్టుబడులతో నిర్వహిస్తోన్న చెత్త నుంచి విద్యుత్ తయారు చేసే కేంద్రాలను సందర్శించింది జీ 20 సమ్మిట్‌కి విచ్చేసిన విదేశీ బృందం.
మూడోరోజు సదస్సులో క్షేత్ర పర్యటన కీలకంగా మారింది. రెండో రోజు సాగరతీర అందాలను వీక్షించిన ప్రపంచదేశాల ప్రతినిధులు ఈ రోజు కార్యరంగంలో జరుగుతున్న పనులను పరిశీలించేపనిలో పడ్డారు. అయితే ఈ పర్యటనను పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య, మీడియాకు దూరంగా కొనసాగిస్తున్నారు.
రేపు దేశంలోని అన్ని మునిసిపల్ కమిషనర్లతో G 20 ప్రతినిధి బృందం సమావేశం కానుంది. నగరాల అభివృద్ది పై పరస్పర అవగాహన రేపు జరగబోతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..