AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: పాలే కాలకూటం విషంలా మారాయా? అస్వస్థతకు కలుషిత నీళ్లే కారణమా?

రాజమండ్రి పరిధిలోని .లాలా చెరువు, చౌడేశ్వరి నగర్ , వెంకటేశ్వర నగర్ ప్రాంతాల్లో బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. బాధితుల్లో చాలా మందికి వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోంది. మూడేళ్ల చిన్నారికి డయాలిసిస్‌ చేయాల్సి వచ్చింది. అస్వస్థతకు అసలు కారణాలేంటి? నీటి కాలుష్యమా? కల్తీ పాలే కారణమా?

Andhra Pradesh: పాలే కాలకూటం విషంలా మారాయా? అస్వస్థతకు కలుషిత నీళ్లే కారణమా?
Mysteriously Disease In Lala Cheruvu
Pvv Satyanarayana
| Edited By: |

Updated on: Feb 23, 2026 | 8:26 AM

Share

తూర్పు గోదావరి జిల్లా లాలా చెరువులో ప్రజలు అంతుచిక్కని రీతిలో అస్వస్థతకు గురవడం సంచలనంగా మారింది. పిల్లలు, పెద్దలు ఆసుపత్రుల పాలయ్యారు. అందరిలో కిడ్నీ సంబంధిత సమస్యలే. మూడేళ్ల పిల్లాడికి కూడా డయాలసిస్‌ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాంతులు, విరేచనాలు, కిడ్నీ సమస్యలతో బాధితుల ఆస్పత్రుల్లో చేరారు. కొందరికి వెంటిలేటర్‌పై వైద్యం కొనసాగుతోంది. మూడేళ్ల చిన్నారికి డయాలిసిస్‌ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పాపం కల్తీ పాలదేనని స్థానికులు ఆరోపించారు. దీంతో పాలు సరఫరా చేసింది కోరుకొండ మండలం నరసాపురానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. రాజమండ్రి చుట్టుపక్కల 150పైగా కుటుంబాలకు అతనే పాలు సరఫరా చేస్తున్నట్టు తేలంది. కోరుకొండ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు డీఎం అండ్‌ హెచ్‌ వో, ర్యాపిడ్ రెస్పాన్స్.. ఫుడ్‌ సేఫ్టీ టీమ్స్‌ రంగంలోకి దిగాయి. సమగ్ర ఎపిడమియాలాజికల్ తోపాటు క్లినికల్ విచారణ చేపట్టారు. బాధితులకు మెరుగైన వైద్యం అందెలా చూడాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. కల్తీ పాలు వల్లనే అస్వస్థత లేదంటే మరేవైనా కారణాలున్నాయా? అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు, నిర్దారణ కోసం శాంపిలస్‌ను టెస్ట్‌ పంపించారు.

మరోవైపు రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ రాజమహేంద్రవరంలో అధికారులను అప్రమత్తం చేసింది. ‘ఎన్యూరియా ‘ అనుమానిత కేసులపై దృష్టించాలని సూచించింది. దీంతో సదరు ప్రాంతాల నుంచి పాలు నీరు, నీరు, ఇతర నములునాల సేకరణ చేస్తున్నారు. ప్రత్యేక వైద్య శిబిరాల ఏర్పాటు, రాపిడ్ రెస్పాన్స్ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఎనిమిది మంది ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లుగా అధికారులు వెల్లడించారు. అక్కడ పరిస్థితులను లోతుగా పరిశీలిస్తున్నామని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు