AP Weather: ఇంకా వర్షాలే పోలే.. రాబోవు 3 రోజులకు వాతావరణ సూచనలు ఇవే
రైతులూ కాస్త అప్రమత్తంగా ఉండండి. అకాల వర్షాల ముప్పు మరో 2, 3 రోజులు ఉండే అవకాశం ఉంది. ఇక రాయలసీమ జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉంది.
ఉత్తర మధ్య మహారాష్ట్రలోని మధ్య భాగాల నుండి ఉన్న ద్రోణి/గాలి కోత ఇప్పుడు ఉత్తర ఛత్తీస్గఢ్ నుండి దక్షిణ తమిళనాడు వరకు విదర్భ, మరాఠవాడ, అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ.ఎత్తులో కొనసాగుతున్నది. ఆంధ్ర ప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణము లో దక్షిణ / నైరుతి దిశలో గాలులు వీస్తున్నాయి.
రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు :-
——————————————
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :– ………………………………….
గురువారం, శుక్రవారం, శనివారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :- ———————–
గురువారం, శుక్రవారం, :- వాతావరణం పొడిగా వుండే అవకాశం ఉంది.
శనివారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
రాయలసీమ :- —————-
గురువారం, శుక్రవారం,:- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశం ఉంది. ఈదురు గాలులు (గంటకు 30 -40 కి మీ వేగం తో)వీచే అవకాశం ఉంది.
శనివారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం