Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Married Couple: పెళ్లి తరువాత వధువు, వరుడు బరువు ఎందుకు పెరుగుతారో తెలుసా? ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం..

చాలా మంది కొత్తగా పెళ్లయిన జంటలు పెళ్లి తర్వాత కొన్ని ప్రత్యేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. వేగంగా బరువు పెరగుతుంటారు. దాన్ని మన పెద్దలు పెళ్లి నీళ్లు పడ్డాయని, బరువు పెరిగిపోయారంటూ చమత్కరిస్తారు. అయితే, దీనికి అసలు కారణం ఏమిటో ఇవాళ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Married Couple: పెళ్లి తరువాత వధువు, వరుడు బరువు ఎందుకు పెరుగుతారో తెలుసా? ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం..
Newly Wedding Couple
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 30, 2023 | 6:36 AM

చాలా మంది కొత్తగా పెళ్లయిన జంటలు పెళ్లి తర్వాత కొన్ని ప్రత్యేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. వేగంగా బరువు పెరగుతుంటారు. దాన్ని మన పెద్దలు పెళ్లి నీళ్లు పడ్డాయని, బరువు పెరిగిపోయారంటూ చమత్కరిస్తారు. అయితే, దీనికి అసలు కారణం ఏమిటో ఇవాళ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెళ్లి కారణంగానే నిజంగా బరువు పెరుగుతారా? లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? తెలుసుకుందాం.

1. వివాహ కార్యక్రమంలో బిజీ..

పెళ్లికి ముందు అబ్బాయిలు, అమ్మాయిలు తమ ఫిట్‌నెస్‌ని కాపాడుకోవడానికి డైట్‌పై పూర్తిగా దృష్టి పెడతారు. కఠిన వ్యాయామాలు చేస్తారు. నడవడం, యోగా వంటివి చేస్తుంటారు. తద్వారా పెళ్లి రోజున మంచి రూపంలో ఉంటారు. అయితే, వివాహ ఆచారాలు ప్రారంభమైన వెంటనే.. అమ్మాయి, అబ్బాయిలకు సమయం ఉండదు. ఈ పరిస్థితి వివాహం తర్వాత దాదాపు ఒక నెల పాటు ఉంటుంది. దీని కారణంగా కూడా కొత్త జంట బరువు పెరుగుతారని టాక్.

2. విందులు..

వివాహానికి సంబంధించి హిందూ సంప్రదాయంలో అనేక ఆచారాలు ఉన్నాయి. ప్రతి కార్యక్రమంలో ఏదో ఒక స్పెషల్ చేస్తుంటారు. ఇక వంటకాలు కూడా అంతే. నెయ్యి, నూనె, పంచదారతో వంటకాలు బోలెడు చేస్తారు. చేసిన వంటకాలను వధువరులకు టేస్ట్ చేయించాల్సిందే. ఆ కారణంగా కూడా వారు బరువు పెరుగుతారు.

ఇవి కూడా చదవండి

3. ఆహ్వానాలు..

వివాహం తర్వాత.. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు కొత్త జంటను తమ తమ ఇళ్లకు ఆహ్వానిస్తారు. ఈ సమయంలో, రకరకాల ఆహారాలు తింటారు. అది శరీరంలో కొవ్వు పెరుగుదలకు కారణం అవుతుంది. ఇంకా ఎక్కువసేపు కూర్చోవడం, కనీసం నడక లేకపోవడం వల్ల కూడా బరువు పెరుగుతారు.

4. దీర్ఘకాలిక అలసట, నిద్ర లేకపోవడం..

పెళ్లి షాపింగ్ దగ్గర్నుంచి సన్నాహాల దాకా, పెళ్లి పనుల్లో కొత్త జంటలు బాగా అలసిపోతుంటారు. సంగీత్ వేడుకలు, మెహందీ, హల్దీ వేడుకల కారణంగా అర్థరాత్రి వరకు మేల్కొనే ఉంటారు. దాంతో నిద్రలేమి సమస్యతో బాధపడుతారు. ఫలితంగా శరీరంలో కొవ్వు పేరుకుపోయి, బరువు పెరుగుతారు.

5. హనీమూన్ ట్రిప్స్..

పెళ్లి అలసట తర్వాత హనీమూన్ ట్రిప్ సమయంలో కూడా ప్రయాణం, హోటల్, రెస్టారెంట్ ఫుడ్, హార్మోన్ల మార్పులకు కారణం అవుతాయి. శరీరం త్వరగా వధువరులు బరువు పెరగడానికి ఇవన్నీ కారణాలు అని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..