Viral Video: కుక్కలను చూసి జడుసుకున్న సింహం.. వీధుల్లో పడుతూ లేస్తూ పరుగో పరుగు..

అడవికి రాజు సింహం. గ్రామానికి రాజు గ్రామసింహం. అయినప్పటికీ.. సింహాన్ని చూస్తే ఏ జంతువైనా హడలిపోవాల్సిందే. ప్రాణభయంతో బిక్కు బిక్కుమంటూ పరుగులు తీయాల్సిందే. అడవిలో జంతువైనా.. గ్రామంలో ఉండే గ్రామసింహం(కుక్క) అయినా సింహాన్ని చూస్తే హడలిపోవాల్సిందే.

Viral Video: కుక్కలను చూసి జడుసుకున్న సింహం.. వీధుల్లో పడుతూ లేస్తూ పరుగో పరుగు..
Lions Vs Dog
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 29, 2023 | 8:30 AM

అడవికి రాజు సింహం. గ్రామానికి రాజు గ్రామసింహం. అయినప్పటికీ.. సింహాన్ని చూస్తే ఏ జంతువైనా హడలిపోవాల్సిందే. ప్రాణభయంతో బిక్కు బిక్కుమంటూ పరుగులు తీయాల్సిందే. అడవిలో జంతువైనా.. గ్రామంలో ఉండే గ్రామసింహం(కుక్క) అయినా సింహాన్ని చూస్తే హడలిపోవాల్సిందే. లేదంటే.. సింహానికి ఫలహారంగా మారడం ఖాయం. అవును మరి.. సింహానికి ఓ జంతువు ఎదురొచ్చినా, సింహం మరో జంతువుకు ఎదురు పడినా లైఫ్ రిస్క్ ఎదుటి జీవికే తప్ప సింహానికి కాదు. అందుకే.. అడవి రాజు సింహం అంటారు. అయితే, ఇంతటి సింహాన్ని సైతం భయంతో పరుగులు పెట్టించాయి కొన్ని కుక్కలు. వీధుల్లో తరుముతూ సుస్సు పోయించాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

గుజరాత్‌లోని గిర్ అటవీ ప్రాంత సరిహద్దు గ్రామాల్లో సింహాలు సంచరించడం చాలా కామన్. మనుషుల మధ్యే నిరంతరం తిరుగుతుంటాయి. రాత్రి అయితే చాలు గుంపులు గుంపులుగా గ్రామాల్లో వీధుల వెంట తిరుగుతూ హల్ చల్ చేస్తుంటాయి సింహాలు. ఈ క్రమంలోనే కొన్ని సింహాలు ఓ గ్రామంలో రాత్రివేళ సంచరిస్తున్నాయి. ఇంతలో ఓ మగ సింహం ఒంటరిగా వీధుల్లో తిరుగుతోంది. దీనిని గమనించిన కుక్కలు.. అంతెత్తు లేచాయి. సింహంపై అరిచాయి. వీధి కుక్కలన్నీ గుంపుగా ఏర్పడి.. ఆ సింహం వెంటపడ్డాయి. కుక్కల దెబ్బకు హడలిపోయిన సింహం.. వీధుల్లో పరుగులు తీస్తూ పరుగులు తీసింది. ఈ ఘటనను గ్రామస్తులు కొందరు సీక్రెట్‌గా వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

సింహాన్ని కొన్ని కుక్కలు ఉరికించడం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. అడవి రాజును వణికించిన గ్రామ సింహాలు అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. మరెందుకు ఆలస్యం.. ఈ వైరల్ వీడియో మీరూ ఓ లుక్కేసుకోండి.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇదే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..