Sri Rama Navami: రాములోరి కల్యాణంలో అరుదైన దృశ్యం.. అతిథులుగా వానరాలు.. వధూవరులను ఆశీర్వదించిన వీడియో వైరల్

ఇక హనుమంతుడు వానర రూపధారి అన్నసంగతి తెలిసిందే.. తాజాగా శ్రీ రామ నవమి రోజున జరిగిన రాములోరి కళ్యాణానికి ప్రత్యేక అతిథులుగా ఇద్దరు హనుమయ్యలు వచ్చారు.

Sri Rama Navami: రాములోరి కల్యాణంలో అరుదైన దృశ్యం.. అతిథులుగా వానరాలు.. వధూవరులను ఆశీర్వదించిన వీడియో వైరల్
Monkeys In Sri Rama Navami
Follow us
Surya Kala

|

Updated on: Mar 31, 2023 | 12:19 PM

ఎక్కడ రామ నామం వినిపిస్తుందో అక్కడ హనుమంతుడు ఉంటాడని హిందువుల నమ్మకం. అసలు దేశంలో రామాలయం లేని ఊరు దాదాపు కనిపించదంటే అతిశయోక్తి కాదు.. రాముడు.. రామ భక్తుడు హనుమంతుడు హిందువులకు అత్యంత ఇష్టమైన దేవుళ్ళు.. రామ నామం జపిస్తే చాలు.. హనుమంతుడు ప్రసన్నమవుతాడని.. ఆధ్యాత్మిక గ్రంథాల ఉవాచ. అందుకనే అంజనేయ స్వామిని ప్రసన్నం చేసుకోవాలనుకునే భక్తులు ముందుగా రామ భక్తులై ఉండాలని.. అప్పుడే విశేషమైన ఫలితాలను వస్తాయని అంటారు.. ఇక హనుమంతుడు వానర రూపధారి అన్నసంగతి తెలిసిందే.. తాజాగా శ్రీ రామ నవమి రోజున జరిగిన రాములోరి కళ్యాణానికి ప్రత్యేక అతిథులుగా ఇద్దరు హనుమయ్యలు వచ్చారు. పెళ్లి కూతురుగా పీటల మీద ఉన్న సీతమ్మవారిని అక్షింతలు వేసిన ఆశీర్వదించాయి వానరాలు.. ఈ అరుదైన ఘట్టానికి వేదికగా మారింది తెలంగాణలోని కొమురంభీం జిల్లా.. వివరాల్లోకి వెళ్తే..

జిల్లాలోని రెబ్బెన మండల కేంద్రంలోని శ్రీరామ ఆలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ఆసక్తి కరమైన దృశ్యం కనువిందు చేసింది. సీతారాముల కళ్యాణ జరుగుతున్న సమయంలో ఎక్కడి నుండి వచ్చాయో కానీ ఓ రెండు వానరాలు అనుకోని అతిధులుగా విచ్చేశాయి,  సీతారామ కళ్యాణం జరుగుతున్నంత సేపు కదల కుండా కనులారా తిలకించాయి. కళ్యాణ ముగిసిన అనంతరం.. పీట దగ్గరకు వెళ్లి వధూవరులైన సీతారాముల విగ్రహాల వద్ద ఉన్న అక్షింతలను చేతిలోకి తీసుకొని.. వాటిని విగ్రహాలపై వేసి ఆశీర్వదించాయి.

అనంతరం మరి కొన్ని అక్షింతలను, పండ్లు ఫలాలను నోట్లో వేసుకుని అక్కడి నుండి వెళ్లిపోయాయి. ఈ దృశ్యాన్ని  చూసిన‌ భక్తులంతా రాములోరి కళ్యాణానికి హనుమంతుల‌ వారి సైన్యం వచ్చిదంటూ మనస్పూర్తి నమస్కరించుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?