Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahu in kundali: జాతకంలో రాహువు శుభం స్తానంలో ఉంటే మీరు రాజే.. రాహు దోషం నుండి విముక్తి కోసం ఏమి చేయాలంటే…

జాతకంలో రాహువు ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు, వ్యక్తి తన జీవితంలో ఆశ్చర్యకరమైన ఫలితాలను పొందుతాడు. జాతకంలో రాహువు తన స్నేహ గ్రహాలతో ఉన్నప్పుడు.. ఆ ప్రభావం మరింత శక్తివంతంగా మారుతుంది.. ఆ వ్యక్తికి శుభ ఫలితాలను ఇస్తుంది.

Rahu in kundali: జాతకంలో రాహువు శుభం స్తానంలో ఉంటే మీరు రాజే.. రాహు దోషం నుండి విముక్తి కోసం ఏమి చేయాలంటే...
Astro Tips For Rahu
Follow us
Surya Kala

|

Updated on: Mar 31, 2023 | 9:34 AM

నవగ్రహాల్లో రాహువు ఒక గ్రహం. ఎవరి జాతకంలో రాహువు శుభ స్థానంలో ఉంటే వారికీ అనేక ప్రయోజనాలు లభిస్తాయి..అయితే వాస్తవానికి రాహువు తమ జీవితాన్ని తలకిందులు చేస్తుందని ఎక్కువమంది భావిస్తారు. అందుకనే రాహువు పేరు వినగానే చాలా భయపడతారు. జ్యోతిష్య శాస్త్రంలో రాహు-కేతువులను అశుభ్ర గ్రహాలుగా పరిగణిస్తారు. రాహువు ప్రభావం వల్ల సూర్యచంద్రుల గ్రహణం కూడా ఏర్పడుతుందని విశ్వాసం. రాహువు దుష్ప్రభావాల కారణంగా.. సదరు వ్యక్తుల జీవితంలో కష్టనష్టాలు ఎదుర్కోవాలని  నమ్ముతారు. రాహువు అశుభ దృష్టి ఉన్న వ్యక్తులు ప్రతి పనిలో వైఫల్యాలను పొందుతారు. వాస్తవానికి రాహువు అన్ని వేళలా అశుభ ప్రభావాలను ఇవ్వడు.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..  రాహువు జాతకంలో శుభ స్థానంలో ఉంటే.. ఈ వ్యక్తి రాజులా జీవించేలా ఆనందాన్ని పొందుతాడు.

జాతకంలో రాహువు అనుకూల స్థానంలో ఉంటే ఒక వ్యక్తి చాలా ధనవంతుడు అవుతాడు. సమాజంలో గౌరవాన్ని పొందుతాడు.  జాతకంలో రాహువు ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు, వ్యక్తి తన జీవితంలో ఆశ్చర్యకరమైన ఫలితాలను పొందుతాడు. జాతకంలో రాహువు తన స్నేహ గ్రహాలతో ఉన్నప్పుడు.. ఆ ప్రభావం మరింత శక్తివంతంగా మారుతుంది.. ఆ వ్యక్తికి శుభ ఫలితాలను ఇస్తుంది.

అదే ఒక వ్యక్తి జాతకంలో రాహువు అశుభ స్థానంలో ఉంటే.. ఆ వ్యక్తిని రాజు నుండి బిచ్చగాడుగా మారిపోతాడు. జాతకంలో రాహువు బలహీనంగా ఉండడం వల్ల ఆర్థిక నష్టం, సామాజిక నష్టం, అనేక రకాల రోగాలు ఎదుర్కోవడం మొదలవుతాయి. వ్యక్తికి ప్రతి పనిలో సమస్యలు మొదలవుతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. జాతకంలో రాహు దోషంతో జన్మించినప్పుడు, కాల సర్ప దోషంతో సహా అనేక రకాల దోషాలు ఉన్నాయి. జాతకంలో రాహువు అశుభ స్థానంలో ఉన్నప్పుడల్లా, ఈ దోషాన్ని పోగొట్టడానికి అనేక చర్యలు తీసుకుంటారు.

ఇవి కూడా చదవండి

రాహు దోషం నుండి విముక్తి కోసం పాటించాల్సిన నియమాలు:

  1. ఎవరి జాతకంలో రాహువు అశుభ స్థానంలో ఉంటే వారు తామసిక ఆహారానికి దూరంగా ఉండాలి.
  2. రాహువుతో బాధపడేవారు నీలం రంగు దుస్తులు ధరించాలి.
  3. రాహువు  అశుభాల నుండి విముక్తి పొందడానికి, ప్రతిరోజూ దుర్గాదేవిని పూజించడం ప్రయోజనకరంగా ఉంటుంది.
  4. దుర్గాదేవితో పాటు, భైరవుడిని కూడా పూజించడం వల్ల రాహు దోషం తొలగిపోతుంది.
  5. రాహు గ్రహంతో బాధపడేవారు బుధవారం రాహువుకు సంబంధించిన వస్తువులను దానం చేయాలి.
  6. రాహు దోషం నుండి బయటపడటానికి గోమేధికాన్ని ధరించాల్సి ఉంటుంది.
  7. రాహు దోష నివారణకు ప్రతి సోమవారం శివుడికి జలాభిషేకం చేయాలి.

మరిన్ని ఆధాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)