AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budh Gochar 2023: నేటి నుంచి ఈ 3 రాశులవారికి కష్టకాలం.. కారణం ఏమిటంటే..?

మార్చి 31 మధ్యాహ్నం 01.31 గంటలకు  గ్రహాల రాకుమారుడైన బుధుడు మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. ప్రస్తుతం బుధుడు మీనరాశిలో ఉండగా.. అక్కడ నుంచి మేషరాశిలోకి అలాగే అశ్విని..

Budh Gochar 2023: నేటి నుంచి ఈ 3 రాశులవారికి కష్టకాలం.. కారణం ఏమిటంటే..?
Budh Gochar 2023
శివలీల గోపి తుల్వా
|

Updated on: Mar 31, 2023 | 1:13 PM

Share

సనాతన హిందూ ధర్మంలోని జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల స్థితిగతులు మానవ జీవితంపై ప్రభావాన్ని చూపిస్తాయి. ఫలితంగా రాశిచక్రంలోని 12 రాశులవారిలో కొందరు లాభపడగా, మిగిలినవారు నష్టపోతుంటారు. ఇదే విషయాన్ని మన పూర్వీకులు నమ్ముతున్నారు. ఇంకా అనేక ఇతర సంస్కృతులలో కూడా ఇదే చెప్పబడుతోంది. అయితే ఈ రోజు మధ్యాహ్నం అంటే మార్చి 31 మధ్యాహ్నం 01.31 గంటలకు  గ్రహాల రాకుమారుడైన బుధుడు మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. ప్రస్తుతం బుధుడు మీనరాశిలో ఉండగా.. అక్కడ నుంచి మేషరాశిలోకి అలాగే అశ్విని నక్షత్రంలో సంచరిస్తాడు. ఇది అన్ని రాశులవారిని ప్రభావితం చేస్తుంది. ప్రస్తుతం శుక్రుడు, రాహువు ఇప్పటికే మేషరాశిలో ఉన్నారు. తాజాగా బుధుడు కూడా ఆ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ మూడు గ్రహాల కూటమి ప్రభావం కొన్ని రాశులపై సానుకూలంగా, మరికొన్ని రాశులపై ప్రతికూలంగా ఉండబోతుంది. మరి ఈ క్రమంలో మేషరాశిలో బుధ గ్రహ సంచారం ఏయే రాశులవారికి నష్టదాయకంగా, ప్రతికూలంగా ఉండనుందో ఇప్పుడు తెలుసుకుందాం..

మేషరాశిలో బుధ సంచారం రాశిచక్రంలోని ఈ 3 రాశులకు కష్టకాలం

వృషభ రాశి: మేష రాశిలో బుధ సంచారం వల్ల వృషభరాశి వారికి హాని కలుగుతుంది. ఈ సమయంలో వృషభ రాశివారు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. అంతేకాకుండామ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమస్యలను, అలాగే సహోద్యోగులతో విభేదాలు తలెత్తుతాయి. అయితే సంతోషించదగిన విషయం ఏమిటంటే.. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది.

కన్య రాశి: బుధ గోచారం వల్ల కన్యారాశి వారు కూడా ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. లేదంటే కుటుంబంలోని వారితో కలహాలు వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉన్నందు వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది.

ఇవి కూడా చదవండి

వృశ్చిక రాశి: మేషరాశిలో బుధ గ్రహ సంచారం వల్ల వృశ్చిక రాశి వారిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ రాశివారు చిన్న పనికి కూడా బాగా కష్టపడాల్సి ఉంటుంది.  ఈ సమయంలో వీరి మానసిక ఒత్తిడికి గురవడమే కాక ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది. ఈ సమయంలో వృశ్చిక రాశివారు రుణవిముక్తి పొందలేరు.

(Note: ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం..)

మరిన్ని జ్యోతిష్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..