IPL 2023: రాజస్థాన్ తరఫున 32 ఏళ్ల టెస్టు స్పెషలిస్ట్ ఐపీఎల్ ఆరంగేట్రం.. ఖాతాలో ఏకంగా 45 సెంచరీలు..
యువ క్రికెటర్లు ఐపీఎల్ టోర్నీలో తమ సత్తా చాటాలని ఎదురు చూస్తారు. అయితే ప్రపంచ క్రికెట్‌లో తన సత్తా చాటి చెప్పిన ఓ వెటరన్ ప్లేయర్ మాత్రం 32 ఏళ్ల వయసులో ఐపీఎల్ ఆరంగేట్రం..
ఐపీఎల్ 16వ సీజన్ నేటి నుంచే ప్రారంభం కాబోతుంది. ఐపీఎల్ ట్రోఫీ కోసం.. 10 జట్ల మధ్య జరిగే 70 మ్యాచ్‌లను వీక్షించేందుకు క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక లీగ్‌లో తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగనుంది. ఇక ఐపీఎల్ అంటేనే యువ క్రికెటర్లకు సువర్ణావకాశం. ఈ లీగ్‌లో చెలరేగితే చాలు.. అంతర్జాతీయ క్రికెెట్‌లో ఆరంగేట్రం చేయడానికి ద్వారాలు తెరుచుకున్నట్లే. అందుకే దేశవిదేశాలలోని యువ క్రికెటర్లు ఐపీఎల్ టోర్నీలో తమ సత్తా చాటాలని ఎదురు చూస్తారు. అయితే ప్రపంచ క్రికెట్‌లో తన సత్తా చాటి చెప్పిన ఓ వెటరన్ ప్లేయర్ మాత్రం 32 ఏళ్ల వయసులో ఐపీఎల్ ఆరంగేట్రం చేస్తున్నాడు. అవును, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్ ఐపీఎల్ క్రికెట్‌లోకి ఈ ఏడాది రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడబోతున్నాడు.
టీమిండియా యువ ఆటగాడు సంజూ శామ్సన్ నాయకత్వంలోని రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి జో రూట్ వచ్చాడు. ఈ ఇంగ్లాండ్ ప్లేయర్ కోసం రాజస్థాన్ జట్టు ఒక కోటి రూపాయలను వెచ్చించి తమ సొంతం చేసుకుంది. ఇక రాజస్థాన్ టీమ్ తరఫున ఐపీఎల్ క్రికెట్‌లోకి వచ్చిన జో రూట్.. ఆటను వీలైనంత సహజంగా ఆడటానికి, ఇంకా బౌలర్ల ముందు కొత్త ఆటను ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తానని తెలిపాడు. అంతేకాక ఐపీఎల్ టోర్నీలో తన ఆటను తప్పకుండా ఆస్వాదిస్తానని, అత్యుత్తమ ప్రదర్శనను కనబరుస్తానని పేర్కొన్నాడు. ఇదే క్రమంలో తన ఐపీఎల్ జట్టు కెప్టెన్ సంజూ శామ్సన్‌పై కూడా ప్రశంసల జల్లు కురిపించాడు రూట్. సంజూ శామ్సన్ బ్యాటింగ్ చూడటం తనకు ఎప్పటినుంచో ఇష్టమని, అతను చాలా ప్రతిభావంతుడని, కెప్టెన్‌గా మరింత పరిణతి చెందుతున్నాడని రూట్ చెప్పాడు.
ఇక జో రూట్ గురించి చెప్పుకోవాలంటే.. ఇంగ్లాండ్ క్రికెట్ దిగ్గజాలలో అతను కూడా ఒకడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అతని ఖాతాలో ఇప్పటికే 45 అంతర్జాతీయ సెంచరీలు కూడా ఉన్నాయి. వాస్తవానికి జో రూట్ ఒక టెస్ట్ స్పెషలిస్ట్. ఇంగ్లాండ్ తరఫున 129 టెస్టులు ఆడిన రూట్.. మొత్తం 10,948 పరుగులు చేశాడు. ఇందులో 29 సెంచరీలు, 57 హాష్ సెంచరీలు ఉన్నాయి. ఈ క్రమంలో అతని హైస్కోర్ 254. అలాగే 158 వన్డే మ్యాచ్‌లు ఆడిన ఈ ఇంగ్లీష్ ప్లేయర్ ఖాతాలో 16 సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలతో సహా 6,207 పరుగులు ఉన్నాయి. ఇక ఐపీఎల్ అనేది టీ20 ఫార్మాట్ కనుక.. జో రూట్ టీ20 కెరీర్ గణాంకాల గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇంగ్లాండ్ తరఫున 32 టీ20 మ్యాచ్‌లు ఆడిన జో రూట్ వాటిలో 893 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో అతని హైస్కోర్ అజేయంగా 90 పరుగులు. ఇంకా ఇందులో 5 అర్థ శతకాలు కూడా ఉన్నాయి.
రాజస్థాన్ రాయల్స్ జట్టు సభ్యులు:
సంజు శాంసన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, షిమ్రాన్ హెట్మెయర్, దీపక్ పడిక్కల్, జోస్ బట్లర్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, ట్రెంట్ బౌల్ట్, ఒబెడ్ మెక్‌కాయ్, నవదీప్ సైనీ, కుల్దీప్ సేన్, కుల్దీప్ యాదవ్, ఆర్ అశ్విన్, యుజ్వేంద్ర, యుజ్వేంద్ర, కేసీ కరియప్ప. జాసన్ హోల్డర్, జాసన్ హోల్డర్, ఆడమ్ జంపా, జో రూట్, డోనోవన్ ఫెరీరా, KS ఆసిఫ్, అబ్దుల్ PA, ఆకాష్ వశిష్ట్, కునాల్ రాథోర్, మురుగన్ అశ్విన్
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..