IPL 2023: అహ్మదాబాద్‌లో భారీ వర్షం.. గుజరాత్ వర్సెస్ చెన్నై మ్యాచ్ జరుగుతుందా? వెదర్ రిపోర్ట్ ఎలా ఉందంటే?
గురువారం సాయంత్రం అహ్మదాబాద్‌లో భారీ వర్షం కురిసింది. గుజరాత్-చెన్నై ఆటగాళ్లు మైదానంలో ప్రాక్టీస్ చేస్తుండగా ఒక్కసారిగా వర్షం ప్రారంభమైంది. దీంతో తడిసి ముద్దయిన ఆటగాళ్లు వెంటనే డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లారు. మరోవైపు మ్యాచ్ జరిగే రోజు వర్షం కురుస్తుందా అనే సందేహం అభిమానుల్లో నెలకొంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫీవర్ మొదలైంది. ఐపీఎల్ 16వ ఎడిషన్‌లో భాగంగా నేడు మొదటి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. అంతకుముందు అట్టహాసంగా టోర్నీ ప్రారంభ వేడుకలు జరగనున్నాయి. ఇందుకోసం నరేంద్ర మోడీ స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అయితే గురువారం సాయంత్రం అహ్మదాబాద్‌లో భారీ వర్షం కురిసింది. గుజరాత్-చెన్నై ఆటగాళ్లు మైదానంలో ప్రాక్టీస్ చేస్తుండగా ఒక్కసారిగా వర్షం ప్రారంభమైంది. దీంతో తడిసి ముద్దయిన ఆటగాళ్లు వెంటనే డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లారు. మరోవైపు మ్యాచ్ జరిగే రోజు వర్షం కురుస్తుందా అనే సందేహం అభిమానుల్లో నెలకొంది. అయితే ఆక్వా వెదర్ రిపోర్ట్ ప్రకారం ఇవాళ (మార్చి31) GT-CSK మ్యాచ్ సమయంలో వర్షం కురిసే అవకాశం లేదు. గురువారం మాదిరిగా శుక్రవారం సాయంత్రం వర్షం కురిసే అవకాశం లేదు. అహ్మదాబాద్‌లో ఈరోజు 33 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. సాయంత్రం, రాత్రి సమయాల్లో ఇది 23 డిగ్రీలకు పడిపోతుంది. వర్షాలు పడే అవకాశం లేదని ఆక్వా వెదర్ తెలిపింది.
కాగా నరేంద్ర మోడీ స్టేడియం IPL 2023 ప్రారంభ వేడుకలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. మైదానాన్ని రంగురంగుల LED లైట్లతో అలంకరించారు. అలాగే ప్రారంభ వేడుకల్లో లేజర్ షో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, మిల్కీబ్యూటీ తమన్నా లైవ్ పెర్ఫామెన్స్ ఇవ్వనున్నారు. అలాగే స్టార్ సింగర్ అర్జిత్ సింగ్ కూడా ఈ వేడుకల్లో భాగం కానున్నాడు. సాయంత్రం 6 గంటలకుఐ పీఎల్ ప్రారంభ వేడుకలు జరుగుతాయి. సుమారు 45 నిమిషాల పాటు ఈ ఈవెంట్ జరగనుంది. కాగా సుమారు నాలుగేళ్ల తర్వాత భారత్‌లో ఐపీఎల్ నిర్వహించడం విశేషం.
??? #??????? ???? ?????? ?????!
Home & away challenge, interesting new additions and the return of packed crowds ??
Hear from the captains ahead of an incredible season ???? – By @Moulinparikh
WATCH the Full Video ?? https://t.co/BaDKExCWP1 pic.twitter.com/jUeTXNnrzU
— IndianPremierLeague (@IPL) March 31, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..