IPL 2023: జీపీఎస్‌ ట్రాకింగ్‌ డివైజ్‌లతో ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడనున్న టీమిండియా క్రికెటర్లు.. కారణమిదే

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్ ఐపీఎల్ మార్చి 31 నుంచి ప్రారంభం కానుంది. టీమిండియా ఆటగాళ్లతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ క్రికెటర్లు ఈ లీగ్‌లో ఆడతారు. అయితే ఈ ధనాధాన్‌ లీగ్‌లో భారత ఆటగాళ్లు జీపీఎస్‌ ఫిట్‌నెస్‌ ట్రాకింగ్‌ డివైజ్‌లను ధరించి మైదానంలోకి అడుగుపెట్టనున్నారు.

IPL 2023: జీపీఎస్‌ ట్రాకింగ్‌ డివైజ్‌లతో ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడనున్న టీమిండియా క్రికెటర్లు.. కారణమిదే
Ipl 2023
Follow us
Basha Shek

|

Updated on: Mar 30, 2023 | 3:57 PM

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్ ఐపీఎల్ మార్చి 31 నుంచి ప్రారంభం కానుంది. టీమిండియా ఆటగాళ్లతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ క్రికెటర్లు ఈ లీగ్‌లో ఆడతారు. అయితే ఈ ధనాధాన్‌ లీగ్‌లో భారత ఆటగాళ్లు జీపీఎస్‌ ఫిట్‌నెస్‌ ట్రాకింగ్‌ డివైజ్‌లను ధరించి మైదానంలోకి అడుగుపెట్టనున్నారు. కేవలం ప్రాక్టీస్‌ సెషన్లలోనే కాదు.. మ్యాచ్‌ల సమయంలోనూ ఆటగాళ్లు ఈ జీపీఎస్‌ పరికరాలు ధరించి మైదానంలోకి దిగనున్నారు. ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ సామర్థ్యాలు, వర్క్‌లోడ్‌ మేనేజ్‌మెంట్‌ ఎప్పటికప్పుడూ ఈ జీపీఎస్‌ పరికరాలు పర్యవేక్షిస్తాయి. ఈక్రమంలోనే మెగా లీగ్‌లో భారత ఆటగాళ్లు గాయపడకుండా బీసీసీఐ జీపీఎస్‌ ఫిట్‌నెస్‌ ట్రాకింగ్‌ డివైజ్‌లను ధరించాలని నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్‌ తర్వాత టీమిండియా ప్రతిష్ఠాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ లో ఆడాల్సి ఉంది. ఇంగ్లండ్‌ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో ఆమీతుమీ తేల్చుకోవాల్సి ఉంది. దీని తర్వాత అక్టోబర్‌లో వన్డే ప్రపంచకప్‌ కూడా ఉంది. గత కొన్నేళ్లుగా ఐసీసీ టోర్నీల్లో టీమిండియా వరుసగా విఫలమవుతోంది. ఈ నేపథ్యంలోనే స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్‌ను గెల్చుకోవడం భారత జట్టుకు చాలా ముఖ్యం.

ఐపీఎల్ తర్వాత ప్రతిష్ఠాత్మక టోర్నీలు ఉన్నందున టీమిండియా ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై బీసీసీఐ ప్రత్యేక దృష్టి పెట్టనుంది. ఇందులో భాగంగానే క్రికెటర్ల నర్జీ లెవెల్, హార్ట్ బీట్, బ్లడ్ ప్రెజర్‌లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే జీపీఎస్‌ ఫిట్‌నెస్‌ ట్రాకింగ్‌ డివైజ్‌లను ధరించే ఆటగాళ్లు మ్యాచ్‌లు ఆడాలని ఆదేశించింది. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు ఈ పరికరాలను ఉపయోగిస్తున్నాయి. భారతదేశంలోని హాకీ జట్టు ఆటగాళ్లు ఈ పరికరాన్ని ఉపయోగిస్తున్నారు. ఇటీవల మహిళల ఐపీఎల్‌ టోర్నీలోనూ మహిళా క్రికెటర్లు ఫిట్‌నెస్‌ ట్రాకింగ్‌ డివైల్‌లతోనే బరిలోకి దిగారు. ఇప్పుడు టీమిండియా ఆటగాళ్లు కేవలం ప్రాక్టీస్‌ సెషన్లలోనే కాకుండా మ్యాచుల్లోనూ వీటిని ధరించి ఆడనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తలు చదవండి

'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్
'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్
దిల్‌ రాజు మనవడు, మనవరాలిని చూశారా? ఇషిక శారీ ఫంక్షన్ ఫొటోస్
దిల్‌ రాజు మనవడు, మనవరాలిని చూశారా? ఇషిక శారీ ఫంక్షన్ ఫొటోస్
రూ. 18 కోట్లకు అర్షదీప్‌ను దక్కించుకున్న పంజాబ్..
రూ. 18 కోట్లకు అర్షదీప్‌ను దక్కించుకున్న పంజాబ్..
మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఆధార్‌తో యాక్టివేట్ చేయాలని తెలుసా?
మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఆధార్‌తో యాక్టివేట్ చేయాలని తెలుసా?
ఏపీ విద్యుత్తు శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం.. నో ఎగ్జాం
ఏపీ విద్యుత్తు శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం.. నో ఎగ్జాం
ఏ సమయంలో ఎండలో నిలబడితే విటమిన్‌ D అధికంగా వస్తుందో తెలుసా?
ఏ సమయంలో ఎండలో నిలబడితే విటమిన్‌ D అధికంగా వస్తుందో తెలుసా?
ఐపీఎల్ హిస్టరీలో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్ ఎవరో తెలుసా?
ఐపీఎల్ హిస్టరీలో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్ ఎవరో తెలుసా?
టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 తుది ఫలితాల తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే?
టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 తుది ఫలితాల తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే?
పెర్త్ టెస్ట్ పై పట్టుబిగించిన టీమిండియా.. ఇక విజయం లాంఛనమే
పెర్త్ టెస్ట్ పై పట్టుబిగించిన టీమిండియా.. ఇక విజయం లాంఛనమే
కోహ్లీ @ 30.. డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్
కోహ్లీ @ 30.. డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్