Balagam Venu: కొండగట్టు అంజన్న స్వామి ఆలయంలో ‘బలగం’ వేణు.. ఫ్యామిలీతో కలిసి ప్రత్యేక పూజలు.. ఫొటోలు వైరల్‌

తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయం అందుకున్న చిత్రం బలగం. జబర్దస్త్‌ కమెడియన్‌ యెల్దండి వేణు మొదటిసారి మెగా ఫోన్‌ పట్టుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. తెలంగాణ భాష, యాస, సంస్కృతి, సంప్రదాయాలను..

Balagam Venu: కొండగట్టు అంజన్న స్వామి ఆలయంలో 'బలగం' వేణు.. ఫ్యామిలీతో కలిసి ప్రత్యేక పూజలు.. ఫొటోలు వైరల్‌
Balagam Director Venu
Follow us

|

Updated on: Mar 29, 2023 | 5:07 PM

తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయం అందుకున్న చిత్రం బలగం. జబర్దస్త్‌ కమెడియన్‌ యెల్దండి వేణు మొదటిసారి మెగా ఫోన్‌ పట్టుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. తెలంగాణ భాష, యాస, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ఎంతో అద్భుతంగా ఈ సినిమాను రూపొందించాడు వేణు. మార్చి 3న విడుదలైన బలగం విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. తెలుగుతనం ఉట్టిపడేలా రూపొందిన ఈ సినిమాను మెగాస్టార్‌ చిరంజీవి, మంత్రి కేటీఆర్‌ తదితర ప్రముఖులు సైతం మెచ్చుకున్నారు. ఇప్పటికీ థియేటర్లలో వసూళ్లు రాబడుతోన్న ఈచిత్రం తాజాగా ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ఫ్రైమ్‌లోకి కూడా అందుబాటులోకి వచ్చింది. దీంతో పలువురు ఈ సినిమాను చూసి ఎమోషనల్‌ అవుతున్నారు. తమ అభిప్రాయాలను సోషల్‌ మీడియాలో పంచుకుంటున్నారు. కాగా మొదటి చిత్రమే భారీ విజయం సాధించడంతో డైరెక్టర్‌ వేణు ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు బలగం సినిమా ప్రమోషన్ల కోసం పలు ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ తిరిగిన అతను తాజాగా కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి కొండగట్టు దేవాలయానికి వెళ్లిన వేణు.. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్‌ చేసుకున్నాడు.

‘కొండగట్టు అంజన్న ఆశీర్వాదంతో బలగం సినిమా మొదలు పెట్టాను. అంజన్న దయతో బలగం మీ అందరిని మెప్పించింది. అంజన్న దర్శనం అద్భుతంగా జరిగింది’ అని తన ఫొటోలకు క్యాప్షన్‌ ఇచ్చాడు వేణు. కాగా దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్‌పై శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించిన బలగం సినిమాలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ హీరో, హీరోయిన్లుగా నటించారు. సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు ప్రధాన పాత్రలలో కనిపించారు. ఓవైపు థియేటర్లలో వసూళ్లు రాబడుతోన్న ఈ చిత్రం ఇటీవలే అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ద్వారా ఓటీటీలోకి వచ్చేసింది. రికార్డ్ స్థాయిలో వ్యూస్ అందుకుంటూ ట్రెండింగ్‌ లిస్టు టాప్‌-2లో నిలిచింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Moodami 2024: మూఢాల్లోనూ యోగాల వర్షం! ఆ రాశుల వారికి శుభ ఫలితాలు.
Moodami 2024: మూఢాల్లోనూ యోగాల వర్షం! ఆ రాశుల వారికి శుభ ఫలితాలు.
దళపతి విజయ్ చేతులు, తలపై గాయాలు.. నెట్టింట్లో ఫోటోలు వైరల్
దళపతి విజయ్ చేతులు, తలపై గాయాలు.. నెట్టింట్లో ఫోటోలు వైరల్
అందమైన దుబాయ్‌ని ఛిద్రం చేసిన వర్షం.. తిరిగి మెరవాలంటే ఎంతఖర్చు.?
అందమైన దుబాయ్‌ని ఛిద్రం చేసిన వర్షం.. తిరిగి మెరవాలంటే ఎంతఖర్చు.?
ఈ 5 అలవాట్లు సంబంధాల్లో చీలికను సృష్టిస్తాయి.. ఈరోజే మార్చుకోండి
ఈ 5 అలవాట్లు సంబంధాల్లో చీలికను సృష్టిస్తాయి.. ఈరోజే మార్చుకోండి
సింగిల్ చార్జ్‌పై ఏకంగా 300 కి.మీ. కొత్త స్కూటర్ అదిరింది..
సింగిల్ చార్జ్‌పై ఏకంగా 300 కి.మీ. కొత్త స్కూటర్ అదిరింది..
మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా
మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా
బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్
బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్
ఈ వస్తువులు మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింట్లోనూ మీదే విజయం..
ఈ వస్తువులు మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింట్లోనూ మీదే విజయం..
సైక్లింగ్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ప్రయోజనాలు తెలిస్తే..
సైక్లింగ్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ప్రయోజనాలు తెలిస్తే..
ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..
ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!