ఆ నలుగురే కాదు.. 40 మంది వైసీపీ ఎమ్మెల్యేలు రావడానికి రెడీగా ఉన్నారు.. టీడీపీ నేత అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు

టీడీపీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే 40 మంది ఎమ్మెల్యేలు పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. రోజూ ఫోన్లు వస్తున్నాయని.. అయితే పార్టీ చర్చించి ఎవరిని చేర్చుకోవాలో నిర్ణయం తీసుకుంటుందన్నారు. వైసీపీ సస్పెండ్‌ చేసిన నలుగురు ఎమ్మెల్యేలతో మాతో..

ఆ నలుగురే కాదు.. 40 మంది వైసీపీ ఎమ్మెల్యేలు రావడానికి రెడీగా ఉన్నారు.. టీడీపీ నేత అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు
Atchannaidu
Follow us
Basha Shek

|

Updated on: Mar 28, 2023 | 9:21 PM

టీడీపీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే 40 మంది ఎమ్మెల్యేలు పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. రోజూ ఫోన్లు వస్తున్నాయని.. అయితే పార్టీ చర్చించి ఎవరిని చేర్చుకోవాలో నిర్ణయం తీసుకుంటుందన్నారు. వైసీపీ సస్పెండ్‌ చేసిన నలుగురు ఎమ్మెల్యేలతో మాతో ఇంకా టచ్‌లోకి రాలేదన్నారు. 40 మంది పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారన్నారు అచ్చెన్నాయుడు. పొత్తులు కొత్తకాదు.. అయితే పొత్తులపై పార్టీలో ఎలాంటి చర్చా జరగలేదు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పార్టీలతో కలిసిపనిచేయాలని మాత్రమే నిర్ణయించాం. ఎన్నికల సమయంలో పొత్తులపై నిర్ణయం ఉంటుందన్నారు అచ్చెన్నాయుడు. హైదరాబాద్‌లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో మంగళవారం (మార్చి 28) టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పొలిట్ బ్యూరో సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీకి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.పొలిట్ బ్యూరో సమావేశం అనంతరం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. అధికార వైసీపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారనే ఆరోపణలు చేస్తున్న వైసీపీ పిచ్చి ప్రేలాపనలు ఆపాలన్నారు. టీడీపీ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలను ఎంతకు కొన్నారో సీఎం జగన్ చెప్పాలని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగింది రహస్య ఓటింగ్ అని.. ఎవరూ ఎవరికి ఓటు వేసిందనేది ఎలా తెలుస్తోందని ప్రశ్నించారు. అలాంటిది రహస్య ఓటింగ్‌ ఓటింగ్ వివరాలు ఎలా తెలిశాయో సజ్జల సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..