AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జూనియర్‌ ఎన్టీఆర్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన స్టార్‌ హీరోయిన్‌.. కుమారులు అభయ్, భార్గవ్‌ల కోసం ఏం పంపిందో తెలుసా?

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన ఈ పీరియాడికల్‌ మూవీలో బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ అలియా భట్‌ హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. సీత పాత్రలో అమ్మడి అభినయానికి అందరూ ఫిదా అయిపోయారు.

జూనియర్‌ ఎన్టీఆర్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన స్టార్‌ హీరోయిన్‌.. కుమారులు అభయ్, భార్గవ్‌ల కోసం ఏం పంపిందో తెలుసా?
Jr.ntr Family
Basha Shek
|

Updated on: Mar 26, 2023 | 7:10 AM

Share

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్‌ ఆస్కార్‌ అవార్డుతో పాటు ఎన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలను సొంతం చేసుకుంది. అలాగే ఈ సినిమాతో హీరోలు రామ్‌చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ గ్లోబల్‌ స్టార్లుగా ఎదిగిపోయారు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన ఈ పీరియాడికల్‌ మూవీలో బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ అలియా భట్‌ హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. సీత పాత్రలో అమ్మడి అభినయానికి అందరూ ఫిదా అయిపోయారు. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైపోయిందీ ఈ ముద్దుగుమ్మ. అలాగే ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లతో కూడా మంచి దోస్తీ కుదిరింది. సినిమాలతో బిజినెస్‌లోనూ దూసుకుపోతోన్న అలియా తన పిల్లల కోసం కాన్షియస్ క్లాతింగ్ పేరుతో ఒక దుస్తుల వ్యాపారాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె తన ఆర్‌ఆర్‌ఆర్‌ హీరోకు సర్ప్రైజ్ ఇచ్చింది. ఎన్టీఆర్‌ పిల్లలు నందమూరి అభయ్‌ రామ్‌, భార్గవ్‌ రామ్‌లకు దుస్తులను పంపించింది. యూ ఆర్ మై ఫేవరెట్ హ్యూమన్ బీన్ అనే బ్యాగ్ లో ప్యాక్ చేసి.. అభయ్ రామ్, భార్గవ్ రామ్ పేర్లతో చెరో బ్యాగ్‌కు ట్యాగ్ లు పెట్టి పంపించింది.

ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌ వేదికగా షేర్‌ చేసుకున్నారు తారక్‌. ఈ సందర్భంగా అలియాకు కృతజ్ఞతలు తెలియజేశారు. ‘ థ్యాంక్స్‌ అలియా.. నీ క్లాతింగ్ బ్రాండ్ ఎప్పుడూ అభయ్ రామ్, భార్గవ్ రామ్ ముఖాల్లో సంతోషాన్ని ఉంచుతుంది. నా పేరు మీద కూడా ఒక బ్యాగ్ చూడాలనుకుంటున్నా’ అని తెలిపాడు. దీనికి స్పందించిన అలియా .. ‘నీకు మాత్రం ఈద్ స్పెషల్ దుస్తులు సిద్ధం చేస్తానని, స్వీటెస్ట్ పర్సన్ థాంక్యూ’ అని రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం అలియా, ఎన్టీఆర్‌ల పోస్టులు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఒక్క ఫోటోతో రూమర్స్‏కు చెక్ పెట్టిన మేకర్స్..
ఒక్క ఫోటోతో రూమర్స్‏కు చెక్ పెట్టిన మేకర్స్..
కస్తూర్బా స్కూల్ వైరల్ వీడియో: దేవతలు, దయ్యాలు అంటూ విద్యార్థిని
కస్తూర్బా స్కూల్ వైరల్ వీడియో: దేవతలు, దయ్యాలు అంటూ విద్యార్థిని
రైస్ + చపాతీ కాంబినేషన్ మంచిదా?ఆరోగ్య నిపుణులు చెప్పిన అసలు విషయం
రైస్ + చపాతీ కాంబినేషన్ మంచిదా?ఆరోగ్య నిపుణులు చెప్పిన అసలు విషయం
ఈ వింత ఘటన వెనుక అసలు కథేంటి..?
ఈ వింత ఘటన వెనుక అసలు కథేంటి..?
మీ హైబీపీని చిటికెలో తగ్గించే పవర్.. దానిమ్మ vs బీట్‌రూట్‌..
మీ హైబీపీని చిటికెలో తగ్గించే పవర్.. దానిమ్మ vs బీట్‌రూట్‌..
నీచ రవితో ఈ రాశులకు దశ తిరిగే ఛాన్స్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
నీచ రవితో ఈ రాశులకు దశ తిరిగే ఛాన్స్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..