AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manchu Manoj: మార్నింగ్‌ విష్ణుతో గొడవ.. బాధగా ఉందంటూ మంచు మనోజ్‌ ట్వీట్‌.. ఫ్యాన్స్‌ రియాక్షన్స్‌ వైరల్‌

అన్నతో వివాదం కాస్త సద్దుమణిగిన తర్వాత తర్వాత మనోజ్‌ సోషల్‌ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టాడు. అది కాస్తా వైరల్‌గా మారింది. అయితే  అది విష్ణుతో గొడవకు సంబంధించినది కాదు.

Manchu Manoj: మార్నింగ్‌ విష్ణుతో గొడవ.. బాధగా ఉందంటూ మంచు మనోజ్‌ ట్వీట్‌.. ఫ్యాన్స్‌ రియాక్షన్స్‌ వైరల్‌
Manchu Vishnu, Manoj
Basha Shek
|

Updated on: Mar 25, 2023 | 11:32 AM

Share

మంచు విష్ణు, మనోజ్‌ల మధ్య నిన్న (మార్చి 24) చోటు చేసుకున్న సంఘటనలు టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారాయి. అన్నదమ్ముల మధ్య ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది కానీ ఎప్పడూ బయటపడిన దాఖలాలు లేవు. అయితే విష్ణు తన మనుషులను కొడుతున్నాడంటూ మనోజ్‌ వీడియో షేర్‌ చేయడంతో అన్నదమ్ముల విభేదాలు కాస్తా రోడ్డున పడ్డాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో మనోజ్‌ వీడియో డిలీట్ చేశాడు. దీనిపై స్పందించిన విష్ణు .. అన్నదమ్ముల మధ్య గొడవలు సాధారణమేనని, ఇది చిన్న విషయమేనని, ఏదో ఆవేశంలో వీడియో పోస్ట్‌ చేశాడంటూ వ్యవహారం పెద్దది కాకుండా జాగ్రత్తపడ్డాడు. అయితే అన్నతో వివాదం కాస్త సద్దుమణిగిన తర్వాత తర్వాత మనోజ్‌ సోషల్‌ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టాడు. అది కాస్తా వైరల్‌గా మారింది. అయితే  అది విష్ణుతో గొడవకు సంబంధించినది కాదు. కోలీవుడ్ స్టార్‌ హీరో అజిత్‌ తండ్రి సుబ్రమణ్యం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిపిందే. ఆయన మృతికి ట్విట్టర్ వేదికా సంతాపం ప్రకటించాడు మనోజ్‌.

‘మణిగారి మరణ వార్త విని బాధేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. అజిత్‌ ఫ్యామిలీకి నా ప్రగాఢ సానుభూతి. ఈ విషాదం నుంచి తట్టుకునే శక్తి మీకు ఇవ్వాలని దేవున్ని ప్రార్థిస్తున్నాను’ అని ట్వీట్‌ చేశాడు మనోజ్‌. అయితే ఈ ట్వీట్‌పై అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘మీ అన్నదమ్ముల మధ్య ఏం జరిగింది? గొడవ సద్దు మణిగిందా? మళ్లీ కలవండి అన్నా’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఇటీవల మంచు మనోజ్‌, మౌనికా రెడ్డి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ వివాహంలో కొద్ది సేపు మాత్రమే కనిపించాడు విష్ణు. దీంతో వీరిద్దరి మధ్య టర్మ్స్‌ అంతగా బాగోలేవనే వార్తలు వచ్చాయి. ఇక నిన్న జరిగిన వ్యవహారంతో అది కాస్తా బట్టబయలైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..