AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ajith Kumar: స్టార్‌ హీరో అజిత్‌ ఇంట తీవ్ర విషాదం.. సంతాపం తెలియజేస్తోన్న సినీ ప్రముఖులు, అభిమానులు

కోలీవుడ్‌ స్టార్‌ హీరో అజిత్‌ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి సుబ్రమణ్యం (84) అనారోగ్యంతో శుక్రవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.

Ajith Kumar: స్టార్‌ హీరో అజిత్‌ ఇంట తీవ్ర విషాదం.. సంతాపం తెలియజేస్తోన్న సినీ ప్రముఖులు, అభిమానులు
Ajith Kumar
Basha Shek
|

Updated on: Mar 24, 2023 | 10:00 AM

Share

కోలీవుడ్‌ స్టార్‌ హీరో అజిత్‌ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి సుబ్రమణ్యం (84) అనారోగ్యంతో శుక్రవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. తండ్రి మృతితో అజిత్‌ ఫ్యామిలీలో తీవ్ర విషాదం నెలకొంది. పలువురు ప్రముఖులు, దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అజిత్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నారు. సుబ్రమణ్యం ఆత్మకు శాంతి చేకూరాలంటూ అజిత్‌ అభిమానులు సోషల్‌ మీడియాలో పోస్టులు షేర్‌ చేస్తున్నారు. సుబ్రమణ్యం కేరళలోని పాలక్కాడ్‌కు చెందిన మలయాళీ. ఆయన భార్య పేరు మోహినీ. ఈ దంపతులకు అజిత్‌ కుమార్‌తో పాటు అనుప్ కుమార్, అనిల్ కుమార్ మొత్తం ముగ్గురు కుమారులున్నారు. కాగా అజిత్‌, ఆయన భార్య షాలిని, పిల్లలందరూ ప్రస్తుతం యూరప్‌ వేకేషన్‌లో ఉన్నారు. తన తండ్రి మరణ వార్త విని ఇప్పటికే చెన్నైకు పయనమైనట్లు తెలుస్తుంది.

కాగా ఈ రోజు సాయంత్రం చెన్నైలో బీసెంట్‌ నగర్‌లోని శ్మశాన వాటికలో అజిత్‌ తండ్రి అంత్యక్రియలు జరగనున్నట్లు తెలుస్తోంది. సుబ్రమణ్యం పక్షవాతంతో పాటు పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఇందుకోసం చికిత్స కూడా తీసుకుంటున్నాడు. అయితే శుక్రవారం తన ఇంట్లోనే ఆయన కన్నుమూశాడు. కాగా ముందు జాగ్రత్త చర్యగా సుబ్రమణ్యం ఇంటి వద్ద పోలీసులు మోహరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి