Actress Pakeezah: బుల్లితెరపై పాకీజా ఎంట్రీ.. తనకు అచ్చొచ్చిన గెటప్‌లోనే అదరగొట్టిన సీనియర్‌ నటి

కొన్ని రోజుల క్రితం వరకు వ్యక్తిగత జీవితంలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న పాకీజా మళ్లీ ముఖానికి రంగు వేసుకుంది. సిల్వర్‌ స్ర్కీన్‌పై కాకపోయినా ఎంతో మందికి జీవితాన్ని ఇస్తోన్న బుల్లితెరపైకి అడుగుపెట్టింది. ఇది ఆమెకు కొత్త జీవితం అని చెప్పలేం కానీ ఆ దశలో మొదటి అడుగు మాత్రం అని కచ్చితంగా చెప్పవచ్చు.

Actress Pakeezah: బుల్లితెరపై పాకీజా ఎంట్రీ.. తనకు అచ్చొచ్చిన గెటప్‌లోనే అదరగొట్టిన సీనియర్‌ నటి
Actress Pakeezah
Follow us
Basha Shek

|

Updated on: Mar 23, 2023 | 11:41 AM

ఒక రోజులో పగలు, రాత్రి ఉన్నట్లే ఒక మనిషి జీవితంలో కష్టాలు, సుఖాలు ఉంటాయి. సమస్యలు ఉన్నాయని భయపడి కూర్చుంటే లైఫ్‌ అక్కడే ఆగిపోతుంది. ధైర్యంగా ఒక్క అడుగు ముందుకు వేయండి. సానుకూల దృక్పథంతో సమస్యలను ఎదుర్కోండి. కొత్త జీవితం సాక్షాత్కరమవుతుంది. ఇవన్నీ ఎందుకు చెబుతున్నామంటే సామాన్యులకైనా, సెలబ్రిటీలకైనా గడ్డు పరిస్థితులు సహజం. ముఖ్యంగా రంగుల ప్రపంచం లాంటి సినిమా ఇండస్ట్రీలో అయితే ఎవరి లైఫ్‌ ఎప్పుడెలా ఉంటుందో అసలు అంచనా వేయలేం. స్టార్‌ స్టేటస్‌ అనుభవించిన వారు హఠాత్తుగా డౌన్‌ ఫాల్‌ అయిపోతారు. అదే సమయంలో కష్టాల సుడిగండంలో ఉన్న వాళ్లు తమ ట్యాలెంట్‌తో ఓవర్‌నైట్‌ స్టార్లుగా మారిపోతారు.  వందల కొద్దీ సినిమాల్లో నటించిన  పాకీజా అలియాస్‌ వాసుకీ పరిస్థితి ప్రస్తుతం ఇలాగే ఉంది. కొన్ని రోజుల క్రితం వరకు వ్యక్తిగత జీవితంలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న పాకీజా మళ్లీ ముఖానికి రంగు వేసుకుంది. సిల్వర్‌ స్ర్కీన్‌పై కాకపోయినా ఎంతో మందికి జీవితాన్ని ఇస్తోన్న బుల్లితెరపైకి అడుగుపెట్టింది. ఇది ఆమెకు కొత్త జీవితం అని చెప్పలేం కానీ ఆ దశలో మొదటి అడుగు మాత్రం అని కచ్చితంగా చెప్పవచ్చు.

సుమారు 150కి పైగా సినిమాల్లో నటించి మెప్పించిన పాకీజా కొన్ని రోజుల క్రితం ఓ ఛానెల్‌ ఇంటర్వ్యూకు హాజరైంది. అందులో తన గడ్డు పరిస్థితుల గురించి చెబుతూ ఎమోషనలైంది. దీంతో మెగా ఫ్యామిలీ ఆమెకు అండగా నిలిచింది. ముందుగా మెగాబ్రదర్‌ నాగబాబు, ఆతర్వాత మెగాస్టార్‌ చిరంజీవి ఆమెకు ఆర్ధిక సహాయం అందించారు .ఇటీవల మా అధ్యక్షుడు విష్ణు కూడా తన సొంత డబ్బులతో మా అసోసియేషన్‌ కార్డు కూడా ఇప్పించారు. ఇలా టాలీవుడ్‌ సెలబ్రిటీల సహాయంతో కొంత తేరుకున్న పాకీజా పాకీజా వాసుకీ ఎక్స్‌ట్రా జబర్దస్త్ కామెడీ షోలోకి అడుగుపెట్టింది. గతంలో తనకు ఎంతో పేరు తీసుకొచ్చిన గెటప్‌లోనే ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. సెలబ్రెటీ స్పెషల్ థీమ్‌తో చేసిన ఈ ఎపిసోడ్‌లో హీరో విశ్వక్‌సేన్‌, రైటర్‌ ప్రసన్న ముఖ్య అతిథులుగా వచ్చారు. ఈ సందర్భంగా తన పాత సినిమాల్లో కనిపించినట్లుగానే గొడుగు పట్టుకుని, కళ్ల జోడు ధరించి స్టేజి మీదకు వచ్చారు. రాగానే తనదైన కామెడీతో అందరినీ కడుపుబ్బా నవ్వించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పాకీజా రీ ఎంట్రీపై అభిమానులు, నెటిజన్లు హర్షం కొనసాగిస్తున్నారు. అయితే ఈ ఒక్క ఎపిసోడ్‌కే పాకీజాను పరిమితం చేయకుండా కంటిన్యూ చేయాలని, ఆమెను ఆదుకోవాలని కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం  క్లిక్ చేయండి..