మీలో దేవుడిని చూస్తున్నాం.. బంగారు బాలయ్య అని అనడంలో అతిశయోక్తి లేదు.. తారకరత్న సతీమణి ఎమోషనల్

నందమూరి తారకరత్న అకాల మరణంతో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం మిగిల్చింది. ముఖ్యంగా భర్తను కోల్పోయిన విషాదం నుంచి అలేఖ్యా రెడ్డి ఇప్పట్లో కోలుకునేలా లేదు. నిత్యం తారకరత్న జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ ఎమోషనలవుతోంది.

మీలో దేవుడిని చూస్తున్నాం.. బంగారు బాలయ్య అని అనడంలో అతిశయోక్తి లేదు.. తారకరత్న సతీమణి ఎమోషనల్
Tarakaratna, Balakrishna
Follow us
Basha Shek

|

Updated on: Mar 22, 2023 | 4:41 PM

నందమూరి తారకరత్న అకాల మరణంతో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం మిగిల్చింది. ముఖ్యంగా భర్తను కోల్పోయిన విషాదం నుంచి అలేఖ్యా రెడ్డి ఇప్పట్లో కోలుకునేలా లేదు. నిత్యం తారకరత్న జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ ఎమోషనలవుతోంది. ఈ కష్టకాలంలో తారకరత్న కుటుంబానికి నందమూరి బాలకృష్ణ అండగా ఉంటున్నారు. తాజాగా తారకరత్న ఫ్యామిలీ పట్ల మరోసారి గొప్ప మనసును చాటుకున్నారు బాలయ్య. తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న హిందూపురంలో నిర్మించిన ఆస్పత్రిలోని ఓ బ్లాక్‌కు తారకరత్న పేరు పెట్టారు. అదేవిధంగా పేదలకు ఉచితంగా గుండె సంబంధిత ఆపరేషన్లు చేయించేందుకు నిర్ణయించారు. దీనిపై స్పందించిన తారకరత్న సతీమణి అలేఖ్యా రెడ్డి  బాలకృష్ణకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా బాలయ్య ఫొటోను తన ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ ఓ ఎమోషనల్‌ నోట్‌ను షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

‘మీ గురించి ఏమని చెప్పను? మీకు నా కృతజ్ఞతలు ఎలా తెలియజేయగలను. నేను ఏమి చెప్పినా మీరు ముందు తక్కువే అవుతుంది. మిమ్మల్ని బంగారు మనసున్న వ్యక్తి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మీరు ఆ పేరుతో పిలిపించుకోవడానికి అర్హులు, మీరు తప్ప బంగారు బాలయ్య అనిపించుకోవడానికి ఎవరూ అర్హులు కాదు. మీరు నాకు ఒక తండ్రి కంటే ఎక్కువ. ఒక స్నేహితుడు కంటే ఎక్కువలా కనిపించారు ఇప్పుడు మాత్రం నేను మీలో ఒక భగవంతుడిని చూస్తున్నాను. మీరు తీసుకున్న ఈ నిర్ణయానికి మా నోట మాటలు రావడం లేదు. మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు. మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో అంతకంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తాం’ అని ఎమోషనల్‌ నోట్‌ రాసింది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇది చూసిన బాలకృష్ణ అభిమానులు ‘ మా బాలయ్య మనసు బంగారం. సాయం చేయడంలో బాలయ్య తర్వాతే ముందు’ అని కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..