AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: కేక ఆఫర్.. పవర్ స్టార్ సరసన ఛాన్స్ అందుకున్న శ్రీలీల.. ఏ సినిమాలో అంటే

సుజిత్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు పవన్. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతోంది.

Pawan Kalyan: కేక ఆఫర్.. పవర్ స్టార్ సరసన ఛాన్స్ అందుకున్న శ్రీలీల.. ఏ సినిమాలో అంటే
Sreeleela
Rajeev Rayala
|

Updated on: Mar 22, 2023 | 4:34 PM

Share

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను లైనప్ చేసిన విషయం తెలుసిందే. ఆయా సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు పవన్. ఇటీవలే సాయి ధరమ్ తేజ్ తో కలిసి పవన్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వినోదయ సిత్తం సినిమా రీమేక్ లో నటిస్తున్నారు పవన్ సాయి ధరమ్ తేజ్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ నుంచి ఫోటోలు కూడా లీక్ అయ్యి వైరల్ గా మారాయి. అలాగే సుజిత్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు పవన్. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో పవన్ సరసన ఇద్దరు భామలు నటించనున్నారట.

ఇక ఈ సినిమా తమిళ్ సినిమా తేరికి రీమేక్ అని తెలుస్తోంది. తమిళ్ లో దళపతి విజయ్ నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాను రీమేక్ చేయనున్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సరసన నటించే ఛాన్స్ అందుకున్న భామలు ఎవరంటే..

పవన్ సరసన హీరోయిన్స్ గా శ్రీలీల, మాళవిక మోహన్ నటించనున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. శ్రీలీలకు కెరీర్ బిగినింగ్ లోనే ఇలా స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ అందుకుంది. ఇక ఇప్పట్లో ఈ అమ్మడికి తిరుగు లేదని అంటున్నారు విశ్లేషకులు. ఇక ఈ సినిమానుంచి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

Follow Us
ఈ సినిమా చాలా స్పెషల్‌గా అనిపించింది: పీవీ సింధు
ఈ సినిమా చాలా స్పెషల్‌గా అనిపించింది: పీవీ సింధు
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
ప్రయాణికులకు అలర్ట్.. కన్ఫర్మ్ టికెట్ రద్దుపై కొత్త నిబంధనలు
ప్రయాణికులకు అలర్ట్.. కన్ఫర్మ్ టికెట్ రద్దుపై కొత్త నిబంధనలు
37 సిక్సర్లు, 43 ఫోర్లతో 549 పరుగులు.. వీడియో చూస్తారా?
37 సిక్సర్లు, 43 ఫోర్లతో 549 పరుగులు.. వీడియో చూస్తారా?
హీల్‌ ప్యారడైజ్‌లో ఇంటర్ ప్రవేశాలకు 2026 నోటిఫికేషన్‌ విడుదల
హీల్‌ ప్యారడైజ్‌లో ఇంటర్ ప్రవేశాలకు 2026 నోటిఫికేషన్‌ విడుదల
తిరుమలలో హీరోయిన్ శ్రీలీల తళుక్కుమన్నారు.. భక్తులతో ముచ్చట్లు
తిరుమలలో హీరోయిన్ శ్రీలీల తళుక్కుమన్నారు.. భక్తులతో ముచ్చట్లు
మైనర్ బాలికను గొంతు కోసి చంపిన యువకులు..!
మైనర్ బాలికను గొంతు కోసి చంపిన యువకులు..!
'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' రివ్యూ.. ఐడియా అదిరిపోయింది కానీ..!
'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' రివ్యూ.. ఐడియా అదిరిపోయింది కానీ..!
హర్మూజ్ నుంచి ఇండియా‌కు షిప్ ఎన్ని రోజుల్లో చేరుతుందో తెలుసా!
హర్మూజ్ నుంచి ఇండియా‌కు షిప్ ఎన్ని రోజుల్లో చేరుతుందో తెలుసా!
విద్యార్ధులకు అలర్ట్.. ఇంటర్ ఫలితాలు విడుదల తేదీ వచ్చేసింది!
విద్యార్ధులకు అలర్ట్.. ఇంటర్ ఫలితాలు విడుదల తేదీ వచ్చేసింది!