Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dasara: ఫ్యాన్స్‌కు పూనకాలే.. దసరా క్లైమాక్స్ నెక్స్ట్ లెవల్‌లో ఉంటుందట..

మునుపెన్నడూ కనిపించనంత ఊరమాస్ లుక్ లో కనిపించనున్నాడు నాని. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Dasara: ఫ్యాన్స్‌కు పూనకాలే.. దసరా క్లైమాక్స్ నెక్స్ట్ లెవల్‌లో ఉంటుందట..
Dasara
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 22, 2023 | 5:07 PM

నేచురల్ స్టార్ నాని నటిస్తోన్న లేటెస్ట్ మూవీ దసరా.  ఈ సినిమాపై నాని బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు. దసరా సినిమా కోసం నాని చాలా కష్టపడ్డాడు. మునుపెన్నడూ కనిపించనంత ఊరమాస్ లుక్ లో కనిపించనున్నాడు నాని. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. సింగరేణి నేపథ్యంలో ఈ మూవీ ఉండనుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్ సినిమా పై అంచనాలను అమాంతం పెంచేశాయి. నాని నటనతో మరోసారి ఆకట్టుకోవడానికి రెడీ అయ్యాడని ఈ ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. అలాగే వెన్నెల పాత్రలో కీర్తిసురేష్ అద్భుతంగా నటించింది. డీ గ్లామర్ లుక్ లో చాలా నేచురల్ గా అనిపించింది కీర్తి.

ఇదిలా ఉంటే ఈ మూవీలో క్లామాక్ సీన్ కోసం చాలా ఖర్చు పెట్టారట. 15 నిమిషాలకు పైగా ఈ క్లైమాక్స్ ఎపిసోడ్ ఉంటుందని  అంటున్నారు. భారీ సెట్టింగ్స్ లో భారీ బడ్జెట్తో ఈ క్లైమాక్స్ షూటింగ్ జరిపారట. సినిమా అంతా ఒక ఎత్తైతే.. క్లైమాక్స్ మరో ఎత్తు అంటున్నారు.

ఈ సినిమా తెలుగుతోపాటు.. తమిళ్, కన్నడ , హిందీ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా, ఈ సబ్జెక్టు పాన్-ఇండియా ఆడియన్స్ కి నచ్చుతుంది అనే ధీమాతో  ఉన్నారు చిత్ర యూనిట్. మార్చి 30వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది.