Ravanasura: ఫాస్ట్ బీట్ సాంగ్‌తో అదరగొట్టిన రావణాసుర.. ఆకట్టుకుంటున్న పాట
ఇటీవలే రెండు సూపర్ హిట్స్ అందుకున్నాడు, త్రినాద్ నక్కిన దర్శకత్వంలో ధమాకా, మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాతో రెండు హిట్స్ అందుకున్నాడు.

మాస్ మహారాజ్ రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవలే రెండు సూపర్ హిట్స్ అందుకున్నాడు, త్రినాద్ నక్కిన దర్శకత్వంలో ధమాకా, మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాతో రెండు హిట్స్ అందుకున్నాడు. ఈ క్రమంలోనే మరో ఇంట్రెస్టింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్, ఆర్ టి టీమ్‌వర్క్స్‌పై రూపొందుతున్న ఎంగేజింగ్ యాక్షన్ థ్రిల్లర్ ‘రావణాసుర’ తో ఈసారి థ్రిల్ చేయడానికి సిద్ధంగా వున్నారు. అభిషేక్ నామా, రవితేజ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయ్యింది. ఈ సాంగ్ ఇప్పటికే యూట్యూబ్ లో ట్రెండింగ్ లో దూసుకుపోయింది.
తాజాగా ఉగాది సందర్భంగా మూడో సాంగ్ ను రిలీజ్ చేశారు. “డిక్కా.. డిశుమ్”.. అంటూ సాగే ఫుల్ జోష్ సాంగ్ ను రిలీజ్ చేశారు. కాసర్ల శ్యామ్ ఈ సాంగ్ కు సాహిత్యం అందించారు. భీమ్స్ సంగీతం అందించిన ఈ సాంగ్ ను స్వాతీ, భీమ్స్, నరేష్ ఆలపించారు.
సుధీర్ వర్మ ఈ సినిమాలో రవితేజను లాయర్ పాత్రలో మునుపెన్నడూ చూడని విధంగా హై యాక్షన్ లో ప్రజంట్ చేస్తున్నారు. శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి సరికొత్త కథని అందించారు. సుధీర్ వర్మ తన మార్క్ టేకింగ్‌తో ఈ చిత్రాన్ని కథనంలో ఊహించని మలుపులతో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు. సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ.. కథానాయికలుగా నటిస్తున్నారు. ఏప్రిల్ 7,2023న రావణాసురు గ్రాండ్‌గా విడుదల కానుంది.