గుర్తుపట్టలేనంతగా మారిపోయిన చిరంజీవి ఫేవరెట్ హీరోయిన్.. లేటెస్ట్ ఫొటోస్ చూసి షాకవుతున్న ఫ్యాన్స్
ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు ప్రాంతానికి చెందిన మాధవి 80-90వ దశకంలో శ్రీదేవి, విజయశాంతి, జయసుధ, జయప్రద వంటి స్టార్ నటీమణులకు గట్టి పోటీ నిచ్చింది. ఇక మెగాస్టార్ చిరంజీవికి అయితే ఫేవరెట్ జోడీగా మారిపోయింది. చిరంజీవి మొదటి సినిమా..

సిల్వర్ స్ర్కీన్‌పై తమ అందం, అభినయంతో అలరించిన తారల్లో చాలామంది హఠాత్తుగా కనుమరుగైపోయారు. కొందరు వివాహం చేసుకుని విదేశాల్లో సెటిలైతే మరికొందరు సెలబ్రిటీ లైఫ్‌కు దూరంగా సింపుల్‌గా లైఫ్‌ను లీడ్ చేస్తున్నారు. అందులో సీనియర్ నటి మాధవి కూడా ఒకరు. ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు ప్రాంతానికి చెందిన మాధవి 80-90వ దశకంలో శ్రీదేవి, విజయశాంతి, జయసుధ, జయప్రద వంటి స్టార్ నటీమణులకు గట్టి పోటీ నిచ్చింది. ఇక మెగాస్టార్ చిరంజీవికి అయితే ఫేవరెట్ జోడీగా మారిపోయింది. చిరంజీవి మొదటి సినిమా ప్రాణం ఖరీదుతో మొదలైన వీరి ప్రయాణం ఇంట్లో రామయ్య- వీధిలో కృష్ణయ్య, చట్టంతో పోరాటం, మరణశాసనం, రోషగాడు, కోతల రాయుడు, దొంగమొగుడు, కుక్క కాటుకు చెప్పు దెబ్బ, బిగ్ బాస్ సినిమా వరకు కొనసాగింది. ముఖ్యంగా ఖైదీ సినిమాలో రగులుతోంది మొగలిపొద పాటలో మెగాస్టార్‌తో పోటీపడి మరీ డ్యాన్స్ చేసింది అందాల తార. అదే సమయంలో మాతృదేవోభవ సినిమాలో తన అద్భుతమైన అభినయంతో అందరితో కంటతడి పెట్టించింది. అప్పట్లోనే ఓ సినిమాలో బికినీలో కనిపించి కుర్ర గారు మతులు పోగొట్టిందామె. చిరంజీవితో పాటు కృష్ణ, శోభన్ బాబు, రజనీకాంత్, కమల్ హాసన్, మిథున్ చక్రవర్తి, జితేంద్ర, అమితాబ్ బచ్చన్, మమ్ముట్టి లాంటి స్టార్ హీరోలతో స్ర్కీన్ షేర్ చేసుకుంది. అలాగే తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళం, ఒరియా భాషల్లో దాదాపు 300కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించింది.
కాగా సినిమా కెరీర్ పీక్స్‌లో ఉండగానే అమెరికాకు చెందిన వ్యాపారవేత్త మ్యాన్ రాల్ఫ్ శర్మను మాధవి వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఈ దంపతులు అమెరికాలోనే స్థిరపడ్డారు. వీరికి టిఫాని శర్మ, ప్రసిల్లా శర్మ, ఎవ్లీన్ అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మాధవి తన భర్తకు ఉన్న ఔషధాల సంస్థ బాధ్యతలను చూసుకుంటున్నారట. అలాగే ఫుడ్ రెస్టారెంట్ బిజినెస్‌లోనూ రాణిస్తున్నారట. సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ మాత్రమే ఫొటోలు షేర్ చేస్తున్నారు మాధవి. తాజాగా తన భర్త పుట్టిన రోజును పురస్కరించుకుని తన ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంది. ఇందులోని చాలా ఫొటోల్లో ఆమె గుర్తుపట్టలేకుండా ఉంది. ఆమె లుక్‌ని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.




View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..