Ashu Reddy: అషూ రెడ్డికి వైన్‌ బాటిల్‌ను గిఫ్ట్‌గా పంపించిన తండ్రి.. నెటిజన్ల రియాక్షన్స్‌ ఏమిటంటే?

బిగ్‌బాస్ బ్యూటీ, ప్రముఖ నటి అషూరెడ్డి పేరు సోషల్‌ మీడియాలో తెగ మార్మోగిపోతోంది. రోజు ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తోంది.

Ashu Reddy: అషూ రెడ్డికి వైన్‌ బాటిల్‌ను గిఫ్ట్‌గా పంపించిన తండ్రి.. నెటిజన్ల రియాక్షన్స్‌ ఏమిటంటే?
Ashu Reddy
Follow us
Basha Shek

|

Updated on: Mar 19, 2023 | 6:40 PM

బిగ్‌బాస్ బ్యూటీ, ప్రముఖ నటి అషూరెడ్డి పేరు సోషల్‌ మీడియాలో తెగ మార్మోగిపోతోంది. రోజు ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తోంది. ఈ మధ్యన ఎక్కువగా విదేశాల్లోనే ఎక్కువగా కనిపిస్తోన్న ఈ ముద్దుగుమ్మ రెండు రోజుల క్రితం ఆస్పత్రి బెడ్‌పై ఉన్న ఫొటోను షేర్‌ చేసి ట్రెండింగ్‌లో నిలిచింది. అయితే ఆమెకు ఏమైందో మాత్రం రివీల్‌ చెప్పలేదు. ఇలా తన సోషల్‌ మీడియా పోస్టులతో ఏదో ఒక రకంగా నెట్టింట్లో రచ్చ చేసే అషూ రెడ్డి తాజా పోస్ట్‌ వైరల్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ఓ మ్యాన్షన్‌ హౌస్‌ లిక్కర్‌ బాటిల్‌ ఫొటో షేర్‌ చేసిన అషూ.. తన తండ్రి తనకు ఓ మద్యం బాటిల్‌ గిఫ్ట్ గా పంపించాడని మురిసిపోయింది. కూతురుకి డాడీ గిఫ్ట్ అని ఈ పోస్టుకు క్యాప్షన్‌ ఇచ్చింది. అయితే ఈ గిఫ్ట్ తన తల్లికి ఏ మాత్రం నచ్చలేదని కూడా రాసుకొచ్చింది ఈ బోల్డ్ బ్యూటీ. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ స్టోరీ చూసిన ఫ్యాన్స్ వామ్మో.. అషు రెడ్డికి తండ్రి ఇలాంటి బహుమతులు కూడా ఇస్తాడా అని ఆశ్చర్యపోతున్నారు. నెటిజన్లు కూడా రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

జూనియర్‌ సామ్‌గా పేరు తెచ్చుకున్న అషూరెడ్డి బిగ్‌బాస్‌ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. బిగ్‌బాస్ ఓటీటీల సీజన్‌లోనూ సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ కొన్ని టీవీ షోల్లోనూ పాల్గొంది. అన్నిటికంటే ముఖ్యంగా వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మతో అషూ రెడ్డి బోల్డ్‌ ఇంటర్వ్యూ హాట్‌ టాపిక్‌గా మారింది. నిజం చెప్పాలంటే సోషల్‌ మీడియాలో అషూపై పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ జరిగింది.

ఇవి కూడా చదవండి
Ashu Reddy 1

Ashu Reddy

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం  క్లిక్ చేయండి..