నితిన్‌ ‘ధైర్యం’ సినిమాలో నటించిన హీరోయిన్‌ గుర్తుందా? ఇప్పుడెలా ఉందో ఏం చేస్తుందో తెలుసా?

Basha Shek

Basha Shek |

Updated on: Mar 18, 2023 | 9:15 PM

డైరెక్టర్‌ తేజ తెరకెక్కించే సినిమాల్లో హీరోయిన్లకు ఎంతో ప్రాధాన్యముంటుంది. మొదటి సినిమా 'చిత్రం'లో నటించిన రీమాసేన్‌ మొదలు లక్ష్మీ కల్యాణంలో యాక్ట్‌ చేసిన కాజల్‌ అగర్వాల్‌ వరకు ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలా 2005లో యూత్‌ స్టార్‌ నితిన్‌ కాంబినేషన్‌లో తేజ తెరకెక్కించిన చిత్రం ధైర్యం

నితిన్‌ 'ధైర్యం' సినిమాలో నటించిన హీరోయిన్‌ గుర్తుందా? ఇప్పుడెలా ఉందో ఏం చేస్తుందో తెలుసా?
Dhairyam Movie

డైరెక్టర్‌ తేజ తెరకెక్కించే సినిమాల్లో హీరోయిన్లకు ఎంతో ప్రాధాన్యముంటుంది. మొదటి సినిమా ‘చిత్రం’లో నటించిన రీమాసేన్‌ మొదలు లక్ష్మీ కల్యాణంలో యాక్ట్‌ చేసిన కాజల్‌ అగర్వాల్‌ వరకు ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలా 2005లో యూత్‌ స్టార్‌ నితిన్‌ కాంబినేషన్‌లో తేజ తెరకెక్కించిన చిత్రం ధైర్యం. ఈ సినిమాతో బాలీవుడ్‌ బ్యూటీ రైమాసేన్‌ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది రైమా. దీంతో మరికొన్ని తెలుగు సినిమాల్లో కనిపిస్తుందనుకున్నారు చాలామంది. కానీ సినిమా కూడా ప్లాప్‌గా నిలవడంతో అదేమీ జరగలేదు. అయితే రవితేజ, ఉదయ్‌కిరణ్‌, తరుణ్‌ వంటి స్టార్‌ హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చినా తిరస్కరించిందని వార్తలు వచ్చాయి. కానీ బాలీవుడ్‌లో మాత్రం ఫుల్‌ స్పీడ్‌లో దూసుకెళ్లింది.గాడ్‌ మదర్‌ అనే సినిమాతో హిందీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సొగసరి ఆ తర్వాత బెంగాళీ సినిమాల్లో ఎక్కువగా నటించింది. అలాగే తమిళ్‌, కన్నడ, మలయాళ సినిమాల్లోనూ అడపాదడపా కనిపించింది. ఆ మధ్యన ఒడిశాకు చెందిన ఓ ప్రముఖ రాజకీయనాయకుడితో రైమాసేన్‌ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుంటారన్న వార్తలు కూడా హల్‌చల్‌ చేశాయి.

అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ అతనికి బ్రేకప్‌ చెప్పేసినట్లు రూమర్లు కూడా వచ్చాయి. ప్రస్తుతం మళ్లీ యాక్టింగ్‌పైనే దృష్టి సారించిందట. ఇదిలా ఉంటే గత కొన్నేళ్లుగా కేవలం బెంగాలీ సినిమాల్లోనే కనిపిస్తోంది. అలాగే కొన్ని వెబ్‌సిరీస్‌ల్లోనూ నటిస్తోంది. ఇటీవల Roktokorobi అనే బెంగాలీ వెబ్‌సిరీస్‌లోనూ నటించి మెప్పించింది. ఇక సోషల్‌ మీడియాలోయూ యాక్టివ్‌గా ఉంటూ నిత్యం తన ఫొటోలు, వీడియోలను షేర్‌ చేసుకుంటోంది.

ఇవి కూడా చదవండి

View this post on Instagram

A post shared by Raima Sen (@raimasen)

View this post on Instagram

A post shared by Raima Sen (@raimasen)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu