Kalabhairava: ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పిన సింగర్‌ కాలభైరవ.. కావాలని అలా చేయలేదంటూ..

'నాటు నాటు' పాటకు ఆస్కార్ దక్కడం, అక్కడి వేదికపై లైవ్ పెర్ఫామెన్స్ ఇవ్వడంపై సింగర్ కాలభైరవ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోషల్‌ మీడియా వేదికగా తన సంతోషాన్ని షేర్‌ చేసుకున్నారు

Kalabhairava: ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పిన సింగర్‌ కాలభైరవ.. కావాలని అలా చేయలేదంటూ..
Kalabhairava
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Mar 17, 2023 | 8:18 PM

ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ అవార్డును గెల్చుకుని స్వదేశంలో గర్వంగా అడుగుపెట్టింది ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌. ఎన్టీఆర్‌ గురువారం (మార్చి 16) హైదరబాద్‌ చేరుకోగా ఇవాళ (మార్చి 17) రామ్‌చరణ్‌- ఉపాసన దంపతులు, దర్శకుడు రాజమౌళి, ఆయన సతీమణి రమ్య, కీరవాణి, కాలభైవ, కార్తికేయ తదితర చిత్రబృందం ఢిల్లీకి చేరుకుంది. ఈ సందర్భంగా ఆర్‌ఆర్‌ఆర్‌ యూనిట్‌కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఇదిలాఉండగా ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ దక్కడం, అక్కడి వేదికపై లైవ్ పెర్ఫామెన్స్ ఇవ్వడంపై సింగర్ కాలభైరవ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోషల్‌ మీడియా వేదికగా తన సంతోషాన్ని షేర్‌ చేసుకున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో భాగమై బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీ కోసం ఆస్కార్స్​లో పెర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం వచ్చినందుకు కృతజ్ఞతుడిగా భావిస్తున్నా. ప్రత్యక్షంగా, పరోక్షంగా అందరూ సహకరించడం వల్లే ఈ ఘనత సాధ్యమైంది. రాజమౌళి బాబా, నాన్న, ప్రేమ్ రక్షిత్ మాస్టర్, ఎస్ఎస్ కార్తీకేయ అన్న.. వారందరి కృషి వల్లే ఈ పాట విశ్వవ్యాప్తమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులతో, సంగీత ప్రియులతో డాన్స్ చేయించిందీ పాట’ అని అందరికీ థ్యాంక్స్‌ చెప్పారు కాలభైరవ. ఇదంతా బాగానే ఉంది కానీ ఈ పోస్టులో యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ పేర్లను ప్రస్తావించడం మర్చిపోయాడు. దీంతో వారి ఫ్యాన్స్‌ కాలభైరవపై మండిపడుతున్నారు.

సోషల్‌ మీడియా వేదికగా తనపై వస్తోన్న నెగెటివిటీని గ్రహించిన కాలభైరవ వెంటనే మరో పోస్ట్‌ పెట్టాడు. ‘నాటు నాటు’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌ ఇంత విజయవంతమవ్వడానికి తారక్‌ అన్న, చరణ్‌ అన్నలే కారణమని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. అయితే అకాడమీ వేదికపై ప్రదర్శనలో అవకాశం రావడానికి నావైపుగా ఎవరెవరు సహకరించారనేది నేను మాత్రమే మాట్లాడా. అంతకుమించి ఇంకేమీ లేదు. అయితే అది తప్పుగా అర్థమైంది. ఇందుకు హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నా’ అని ట్వీట్‌ చేశారు కాలభైరవ. కాగా ఆస్కార్‌ వేడుకలో ‘నాటు నాటు’ పాటకు లైవ్ పెర్ఫామెన్స్​తో అదరగొట్టారు కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్. వీళ్ల పాటకు హాలీవుడ్ డాన్సర్లు స్టేజీ పెర్ఫామెన్స్ అందరినీ ఆకట్టుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.