AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sana Khan: త్వరలోనే తల్లి కానున్న హీరోయిన్‌.. మొదటి బిడ్డను చేతుల్లోకి తీసుకునేందుకు ఎదురుచూస్తున్నానంటూ..

సినిమా రంగంలో ఓ వెలుగు వెలిగి కనుమరుగైన హీరోయిన్లలో సనా ఖాన్‌ ఒకరు. 2005లో ఓ చిన్న సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ అందాల తార తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ చిత్రాల్లో నటించి మెప్పించింది.

Sana Khan: త్వరలోనే తల్లి కానున్న హీరోయిన్‌.. మొదటి బిడ్డను చేతుల్లోకి తీసుకునేందుకు ఎదురుచూస్తున్నానంటూ..
Sana Khan
Basha Shek
| Edited By: |

Updated on: Mar 17, 2023 | 8:18 PM

Share

సినిమా రంగంలో ఓ వెలుగు వెలిగి కనుమరుగైన హీరోయిన్లలో సనా ఖాన్‌ ఒకరు. 2005లో ఓ చిన్న సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ అందాల తార తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ చిత్రాల్లో నటించి మెప్పించింది. 2010లో కల్యాణ్‌ రామ్‌ కత్తి సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది సనాఖాన్‌. ఆతర్వాత నాగార్జున గగనం, మంచు మనోజ్‌ మిస్టర్‌ నూకయ్య సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ఇక హిందీలో సల్మాన్‌ ఖాన్‌ జయహో, అక్షయ్‌ కుమార్‌ టాయిలెట్‌: ఏక్‌ ప్రేమ్‌కథా సినిమాల్లోనూ కనువిందు చేసింది. అంతకుముందు హిందీ బిగ్ బాస్ సీజన్ 6లో పాల్గొని సెకండ్ రన్నరప్ గా నిలిచి బాలీవుడ్‌ బుల్లితెర ప్రేక్షకులకు బాగా చేరువైంది.మొత్తం మీద 14 సినిమాలు, 50కు పైగా యాడ్లలో నటించిన ఈ ముద్దుగుమ్మ కెరీర్‌ పీక్స్‌లో ఉండగానే సినిమాలకు గుడ్‌ బై చెప్పేసింది. 2019లో విశాల్ నటించిన అయోగ్యలో చివరిగా కనిపించిన ఆమె మరుసటి ఏడాదే సినిమాల నుంచి తప్పుకుంటానని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.ఆతర్వాత ముఫ్తీ అనస్ సయ్యద్ ను వివాహం చేసుకుని దుబాయ్‌ వెళ్లిపోయి అక్కడే స్థిరపడిపోయింది.

సినిమాల నుంచి దూరంగా ఉన్నప్పటికీ సోషల్‌ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంది సనాఖాన్‌. తన భర్తతో కలిసి దిగిన ఫొటోలను అప్పుడప్పుడూ షేర్‌ చేస్తుంటుంది. ఈక్రమంలో ఓ శుభవార్త చెప్పిందీ ముద్దుగుమ్మ. త్వరలోనే తాను తల్లిగా ప్రమోషన్‌ పొందనున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది హాజ్ తీర్థ యాత్రకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న సనాఖాన్ అప్పుడే ఈ శుభవార్తను పంచుకుంది. తాజాగా మరోసారి ఈ విషయంపై నోరు విప్పారు సనాఖాన్‌ దంపతులు. తమ మొదటి బిడ్డ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది. తాను గర్భం దాల్చానని, జూన్ చివరిలో తన డెలివరీ అని ఎమోషనల్‌గా చెప్పుకొచ్చింది. ఇది తనకి అందమైన ప్రయాణం అనుకుంటున్నానని, తన బిడ్డను తన చేతులతో ఎత్తుకునేందుకు ఎదురు చూస్తున్నట్లు భావోద్వేగానికి గురైంది. ప్రస్తుతం సనాఖాన్‌ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. పలువురు ప్రముఖులు, నెటిజన్లు సనాఖాన్‌ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం  క్లిక్ చేయండి..

Follow Us
బయట జోరు వాన..ఇంట్లో ఘుమఘుమలాడే అరటికాయ బజ్జీ.. ఎలా చేయాలంటే?
బయట జోరు వాన..ఇంట్లో ఘుమఘుమలాడే అరటికాయ బజ్జీ.. ఎలా చేయాలంటే?
పాటే ప్రాణంగా వస్తున్న సింగీతం శ్రీనివాసరావు ‘సింగ్ గీతం’..!
పాటే ప్రాణంగా వస్తున్న సింగీతం శ్రీనివాసరావు ‘సింగ్ గీతం’..!
పనిమనిషిగా వెళ్లి తల్లిగా మారిన ఆదిలక్ష్మి.. భావోద్వేగ కథ
పనిమనిషిగా వెళ్లి తల్లిగా మారిన ఆదిలక్ష్మి.. భావోద్వేగ కథ
ఇరాన్ టీమ్‌కు నరకం చూపిస్తున్న అమెరికా అడ్మినిస్ట్రేషన్
ఇరాన్ టీమ్‌కు నరకం చూపిస్తున్న అమెరికా అడ్మినిస్ట్రేషన్
ఒకే ఫ్రేమ్‌లో 120 మంది.. వనపర్తి జిల్లాలో ఐదు తరాల అపురూప సంగమం
ఒకే ఫ్రేమ్‌లో 120 మంది.. వనపర్తి జిల్లాలో ఐదు తరాల అపురూప సంగమం
ఎంపీ, ఎమ్మెల్యేల దెబ్బతో సోనియాతో దీదీ కీలక భేటీ!
ఎంపీ, ఎమ్మెల్యేల దెబ్బతో సోనియాతో దీదీ కీలక భేటీ!
9 నిమిషాల్లో 50 కిలోమీటర్ల ప్రయాణం.. మెరుపు తీగల దూసుకుపోయే రైలు
9 నిమిషాల్లో 50 కిలోమీటర్ల ప్రయాణం.. మెరుపు తీగల దూసుకుపోయే రైలు
మొన్ననే బ్రేకప్ అన్నారు.. అప్పుడే మళ్లీ కలిసిపోయిన జయం రవి,కెనీషా
మొన్ననే బ్రేకప్ అన్నారు.. అప్పుడే మళ్లీ కలిసిపోయిన జయం రవి,కెనీషా
గిల్, రాహుల్‌లు కాదు.. అతడే టీమిండియా టెస్ట్ బ్యాటర్
గిల్, రాహుల్‌లు కాదు.. అతడే టీమిండియా టెస్ట్ బ్యాటర్
ఇంజనీరింగ్‌ అడ్మిషన్లు మొదలవుతున్నాయ్‌.. జూన్‌ 19 నుంచే ప్రారంభం
ఇంజనీరింగ్‌ అడ్మిషన్లు మొదలవుతున్నాయ్‌.. జూన్‌ 19 నుంచే ప్రారంభం