స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లోనే నాగార్జున శివ సినిమా క్లైమాక్స్‌.. 34 ఏళ్ల క్రితం బిల్డింగ్ ఎలా ఉండేదో మీరే చూడండి

ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్వప్నలోక్‌ ఫైర్‌ యాక్సిడెంట్‌పై స్పందించారు. ఈ ఘటన చాలా బాధాకరమని అన్న ఆయన స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లోనే నాగార్జున శివ సినిమా క్లైమాక్స్‌.. 34 ఏళ్ల క్రితం బిల్డింగ్ ఎలా ఉండేదో మీరే చూడండి
Swapnalok Complex
Follow us
Basha Shek

| Edited By: Ravi Kiran

Updated on: Mar 17, 2023 | 8:18 PM

సికింద్రాబాద్‌ స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అత్యంత దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఈ ఆరుగురు కూడా పాతికేళ్లు నిండనివారే. దీంతో వారి కుటుంబాలు ఇప్పుడు తల్లడిల్లిపోతున్నాయి. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌తో పాటు పలువురు ప్రముఖులు స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్రమంలో ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్వప్నలోక్‌ ఫైర్‌ యాక్సిడెంట్‌పై స్పందించారు. ఈ ఘటన చాలా బాధాకరమని అన్న ఆయన స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. నాగార్జున నటించిన సూపర్‌ డూపర్‌ హిట్ శివ సినిమా క్లైమాక్స్‌ను స్వప్నలోక్ కాంప్లెక్స్‌ పైనే చిత్రీకరించినట్టు గుర్తుచేసుకున్నారు. సినిమా ఎండింగ్‌లో నాగార్జున, రఘువరన్ మధ్య వచ్చే ఫైటింగ్ సీక్వెన్స్‌ను అక్కడే షూట్‌ చేసినట్లు ఆర్జీవీ పేర్కొన్నారు. ఈ మేరకు దీనికి సంబంధించిన వీడియోను కూడా ట్విట్టర్‌లో షేర్‌ చేసుకున్నారు వర్మ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మీ కుక్కను కూడా తీసుకెళ్లాల్సింది..

అంతకుముందు స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌ వెళ్ళానని..రెస్క్యూ ఆపరేషన్స్‌ని మానిటర్‌ చేస్తున్నానంటూ మేయర్‌ విజయలక్ష్మి ట్వీట్‌కి రామ్‌గోపాల్‌ వర్మ ఘాటుగా స్పందించారు. మీకుక్కల్ని కూడా తీసుకెళ్ళకపోయారా? అంటూ మేయర్‌ని ఎద్దేవా చేశారు. ఇదిలా ఉంటే స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో మరణాల వెనుక మరో కోణం హడలెత్తిస్తోంది. చైన్‌ మార్కెటింగ్‌ అంటూ రూ.లక్షలు కట్టించుకుని.. క్యూనెట్ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనీ..ఇప్పుడు ఇన్సూరెన్స్ కోసం ప్రమాదాన్ని సృష్టించారంటూ బోరుమంటున్నారు మృతుల కుటుంబ సభ్యులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం  క్లిక్ చేయండి..